Rainy Season Tips: అసలే వర్షాకాలం.. లో దుస్తుల విషయంలో జాగ్రత్త! ఇలా మాత్రం చేయకండి!

Rainy Season Tips: Precautions To Take About Inners While Wearing - Sakshi

లో దుస్తుల విషయంలో... 

సాధారణంగా చాలా మంది దుస్తుల కోసం వేల రూపాయలు ఖర్చుపెడుతుంటారు. అయితే... లో దుస్తుల విషయంలో మాత్రం తగిన శ్రద్ధ వహించరు. చవకరకం లోదుస్తులు వాడతారు. దానివల్ల ఎంతో అసౌకర్యం. మామూలుగా రోజువారి ధరించే లో దుస్తులు వర్షాకాలంలో ధరించకూడదు. మరి ఎలాంటి లో దుస్తులు వేసుకోవాలో చూద్దాం..

జననాంగాల్లో ఇన్ఫెక్షన్లు!
వర్షాకాలంలో దుస్తులు త్వరగా ఆరవు. ఉతికిన దుస్తులు ఎండటానికి కనీసం రెండు మూడు రోజులు పడుతుంది. అలా రెండు, మూడు రోజులు బయట ఉన్నవాటిని ధరించడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. పూర్తిగా ఎండకుండా.. తడిగా ఉన్న లో దుస్తులు ధరించడం వల్ల బాక్టీరియా తయారై.. జననాంగాల్లో ఇన్ఫెక్షన్లు సంభవించే ప్రమాదం ఉంది.

వ్యాయామం చేసిన తర్వాత
అంతేకాదు, వర్షాకాలంలో కూడా వ్యాయామం చేసిన తర్వాత కాళ్ల దగ్గర చెమటలు వస్తాయి. అప్పుడు లో దుస్తులు తడిసిపోతాయి. వాటిని అలానే ఉంచుకుంటే.. దురద లాంటివి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి.. వ్యాయామం తర్వాత వెంటనే లో దుస్తులు మార్చుకోవాలి.

కాటన్‌వి అయితే!
►ఇక బిగుతుగా ఉండే లోదుస్తులను ధరించకూడదు. దానివల్ల రక్త ప్రసరణ సరిగా జరగదు. కాబట్టి.. కొద్దిగా వదులుగా ఉండే లో దుస్తులు ధరించడమే ఉత్తమం.
►లోదుస్తులను చాలా రకాల మెటీరియల్‌తో తయారు చేస్తున్నారు కానీ స్వచ్ఛమైన కాటన్‌వి అయితేనే మంచిది. 
►అలాగే, లోదుస్తులను శుభ్రపరిచే డిటర్జెంట్ల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి.
►గాఢమైన వాసనలతో ఉండే డిటర్జెంట్లు వాడకపోవడం మంచిది.
►ఎందుకంటే వాటిలోని రసాయనాలు రకరకాల ఇన్ఫెక్షన్లకు కారణం కావచ్చు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 

ఇవి కూడా పాటించండి!
►ఈ సీజన్‌లో బ్యాగ్‌లో ఎప్పుడూ కొన్ని పాలిథిన్‌ కవర్లు ఉంచుకోవాలి.
►అలాగే తేలికగా ఉండే రెయిన్‌ కోట్‌ ఒకటి స్పేర్‌లో ఉంచుకోవాలి.
►వీటితోపాటు జలుబు, దగ్గుకు వాడే ట్యాబ్లెట్లు, హ్యాండ్‌ కర్చీఫ్‌లు, విక్స్, లవంగాలు వంటివి ఉంచుకోవడం మంచిది.
►గొంతులో గరగరగా ఉన్నప్పుడు లవంగాలు బాగా పని చేస్తాయి. 
చదవండి: Monsoon- Wardrobe Ideas: వర్షాకాలంలో ఈ దుస్తులు అస్సలు వద్దు! ఇవి వాడితే బెటర్‌!
Health Benefits Of Corn: మొక్కజొన్న పొత్తు తరచుగా తింటున్నారా? ఇందులోని లైకోపీన్‌..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top