కాలికి ధరిస్తే కళ్లు పట్టేస్తున్నాయి.. | Sakshi
Sakshi News home page

కాలికి ధరిస్తే కళ్లు పట్టేస్తున్నాయి..

Published Fri, Mar 1 2024 7:39 AM

New Design Of Anklets Collection For Bridals - Sakshi

అందమైన పాదాలను అంటిపెట్టుకునే అందియలు అమ్మాయిలకు అత్యంత ఇష్టం అందుకే, పట్టీలు వారి అలంకరణలో ఎప్పుడూ ప్రత్యేకతను నింపుకుంటాయి. ఈ ఆధునిక యుగంలో అమ్మాయిలు పట్టీలు పెట్టుకోవడం లేదు అనే నిన్నటి తరం నిరాశను దూరం చేస్తూ... ఆంకిల్స్‌ పేరుతో వచ్చి కొత్తగా చేరిపోయాయి.

వాటితో పాటు బంగారు, వెండి, డైమండ్‌ ఆభరణాలలోనూ, ఇమిటేషన్‌ జ్యువెలరీలోనూ సగం పాదాన్ని కప్పేస్తున్నట్టుగా ఉండే పట్టీల డిజైన్లు ఎన్నో వచ్చాయి. సందర్భానికి తగినట్టు అలంకరించుకోవడానికి వేటికవి ప్రత్యేకతను కలిగి ఉంటున్నాయి. కాలికి ధరించేవే అయినా కళ్లనూ పట్టేస్తున్నాయి.


మొఘలాయ్‌ రాణివాసపు హంగు కాలి అందియలలోనూ కనిపిస్తుంది. పెళ్లి పల్లకీ, రాజు రాణీ, నెమళ్లు, పువ్వుల డిజైన్లతో ఆకట్టుకుంటున్న పట్టీలు నేటితరం అమ్మాయిలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

పూసలు, రత్నాలు
వరసలుగా అల్లుకుపోయిన పూసలు కాలి పట్టీలుగా అమరి ఆధునికతనూ, సంప్రదాయతకు మేళవింపుగా ఉన్నాయి. పెద్ద పెద్ద రత్నాలు వీటిలో విశేషంగా అమరిపోయాయి.

ఆధునికత...
స్నేక్, రౌండ్‌ స్టైల్‌లో ఉండే బంగారు, వెండి ఆంక్లెట్‌ మోడ్రన్‌ స్టైల్‌కి అదనపు హంగుగా అమరుతున్నాయి.

ఇవి చదవండి: ఇదేందయ్యా ఇది..! డెస్టినేషన్‌ వెడ్డింగ్‌.. వేరే లెవల్‌!

Advertisement
 
Advertisement