దటీజ్‌ ఫాతిమా బాష్‌..! వివాదాలు, హేళనలే ఆమె బలం.. | Miss universe 2025 winner fatima bosch Heself controversies apologies | Sakshi
Sakshi News home page

దటీజ్‌ ఫాతిమా బాష్‌..! వివాదాలు, హేళనలే ఆమె బలం..

Nov 21 2025 12:11 PM | Updated on Nov 21 2025 12:54 PM

Miss universe 2025 winner fatima bosch Heself controversies apologies

మిస్‌ యూనివర్స్‌ 2025 విజేతగా మిస్‌ మెక్సికో ఫాతిమా బాష్‌(25) కిరీటం దక్కించుకుని, టబాస్కో నుంచి గెలుపొందిన తొలి మహిళగా బాష్‌ చరిత్ర సృష్టించింది. నిజానికి ఈ కీరిటం అంత సులభంగా రాలేదు. పైగా ఆమె ఈ పోటీలో పాల్గొనే స్థాయికి చేరుకోవడానికి ఎన్నో హేళనలు, అవమానాలు, ధిక్కారాలను దాటుకుని వచ్చింది. తగ్గేదే లే అంటూ తాను ఎంత వరకు ఎఫెక్ట్‌ పెట్టాలో అంతా పెట్టి.. గెలుపుని పాదాక్రాంతం చేసుకుని శెభాష్‌ అనిపించుకుంది ఫాతిమా బాష్‌. 

నిజానికి ఫాతిమాని చిన్నప్పటి నుంచి స్కూల్‌లో తోటి విద్యార్థులు చులకనగా చూసేవారు. టబాస్కోలోని శాంటియాగో డి టీపాలో జన్మించిన ఆమెకు పుట్టుకతోనే స్లెక్సియా,  ADHD అనే నాడి సంబంధిత సమస్యల ఉన్నాయి. దీని కారణంగా బాష్‌ చదువులో వెనకుండేది. సింపుల్‌గా చెప్పాలంటే మాట్లాడటంలో తడబాటు, ఒకచోట కుదురుగా కూర్చొని చదవలేని మానసిక సమస్య. 

ఆ సమస్యను చేధించి తానేంటో ప్రూవ్‌ చేసుకుని అందాల పోటీకి వస్తే..మళ్లీ ఇక్కడ కూడా వివాదం వెంటాడింది. ఆమె స్థానంలో మరొకరెవరైనా..తప్పుకునేవారేమో. ఇక్కడుంది ఫాతిమా కాదన్న వాళ్ల నోళ్లే మూయించేలా.. తడకా చూపించాలనుకుంది. అందుకే ఆ అవమానాలు, ధిక్కారాలను బలంగా మార్చుకుని విజయం తన ముంగిట్లోకి వచ్చేలా చేసుకుని యావత్తు ప్రపంచం తనవైపు చూసేలా చేసుకుంది. ఇంతకీ ఫాతిమా బాష్‌కు అందాల పోటీలో ఎదురైన వివాదం ఏంటంటే..

ఈ అందాల రాణి అంత సులభంగా కిరీటాన్ని తన ఖాతాలో వేసుకోలేదు. ఎందుకంటే మిస్‌ యూనివర్స్‌2025 సాష్‌ వేడుకల్లోనే ఆమెకు అవమానం, బెదిరింపులు ఎదురయ్యాయి. మొత్తం ప్రపంచ దేశ సుందరీమణుల అందరి ముందు ఘోరంగా అవమానపాలైంది. సాక్షాత్తు మిస్‌ యూనివర్స్‌పోటీల అధికారి నవాత్ ఇత్సారగ్రిసిల్ ఆమెను నిందించడం బాధకరం. అంతేగాదు ఒక మహిళగా తన వ్యక్తిత్వాన్నే కించపరిచేలా సోషల్‌ మీడియా లైవ్‌స్ట్రీమింగ్‌లో ఆయన ఇలా వ్యాఖ్యానించడం అందర్ని విస్తుపోయేలా చేసింది. 

దాంతో ఒక్కసారిగా ఫాతిమాకు సోషల్‌మీడియా నెటిజన్లతో సహా తోటి సుందరీమణులు మద్దతు వెల్లువెత్తింది. ఆ అధికారి దృష్టిలో ఇక్కడ బాష్‌ చేసిన తప్పిదం ఏంటంటే..అందాల పోటీలు జరుగుతున్న ధాయిలాండ్‌ గురించి సోషల్‌ మీడియాలో ప్రమోట్‌ చేయకపోవడం, అలాగే తన జాతీయ అధికారి మాటలనే ఆదేశిస్తుందనేది నవాత్ ఇత్సారగ్రిసిల్ ఆరోపణలు. ఆనేపథ్యంలోనే ఆమెను దారుణంగా అవమానిస్తూ దుర్భాషలాడాడు. ఆఖరికి ఆమె పోటీ నుంచి నిష్క్రమించేలా పరిస్థితి తారాస్థాయికి చేరుకుంది. 

ఇదేం పద్దతి అంటూ మిస్‌ యూనివర్స్‌ పోటీలపై సర్వత్రా విమర్శలు రావడంతో మిస్‌ యూనివర్స్‌ ఆర్గనైజేషన్‌ జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కబెట్టింది. అంతేగాదు ఈ ఘటనకు క్షమాపణు చెప్పడమే గాక సదరు అధికారికి చీవాట్లు సైతం పెట్టింది. ఈ పోటీల్లో అతడు జోక్యం ఉండదని నామామాత్రంగానే న్యాయనిర్థేధికారిగా ఉంటాడని వివరణ కూడా ఇచ్చింది. ఇంతటి పరిస్థితుల్లో కూడా ఆమె మీడియా ముందు..ఒక మహిళగా తనకు గౌరవం ఇవ్వలేదని, తన దేశ జాతీయుడితో ఉన్న సమస్యను..నాతో ముడివేసి ఆ అధికారి ఇబ్బందులకు గురిచేశాడని ధైర్యంగా చెప్పింది. 

అంతేగాదు తనెనెవరు ఈ పోటీల్లో పాల్గొనకుండా చేయలేరు, కిరీటం దక్కించుకోకుండా చేయలేరు అని నర్మగర్భంగా చెప్పి అందర్ని విస్మయానికి గురి చేసింది. ఆ తర్వాత జరిగిన ప్రతి పోటీలోనూ తన దైన శైలిగా న్యాయనిర్థేతలను, ప్రేక్షకులను మెప్పించింది. ఆఖరికి క్వశ్చన్‌ రౌండ్‌లో కూడా ప్రపంచ వేదికపై మహిళలు తమ గొంతున వినిపించి..మార్పు తీసుకురావాలని శక్తిమంతంగా సమాధానమిచ్చి జడ్జీల మన్ననలను అందుకుంది. 

ఊహించని ఝలక్‌..!
థాయ్‌లాండ్‌లోని నోంతబురి నగరంలో అంగరంగవైభవంగా ఈ గ్రాండ్‌ ఫినాలే జాలిస్కో, లోపెజ్, ఫెర్నాండా ప్యూమా, ఎమిరే అరెల్లానో, ఎలెనా రోల్డాన్ వంటి అందాల భామలతో తలపడింది బాష్‌. వివాదంలో నిలిచింది కాబట్టి బాష్‌ గెలుస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. అంతా మిస్‌ జాలిస్కోదే కిరీటం అనుకున్నారు. అయితే అక్కడ న్యాయనిర్థేతలు అనూహ్యంగా ఫాతిమా బాష్‌ను మిస్‌ యూనివర్స్‌గా ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. 

మీడియా ముందు చెప్పినట్లుగానే కిరీటం దక్కించుకుంది కదా అంటూ..అందరూ సాహో రాణి అని కీర్తించారు. చిన్నప్పుడూ మాటల్లో స్పష్టత లేక తడబడి అల్లాడిన ఆ చిన్నారే..ఆ మానసిక సమస్యను బలంగా మార్చుకుని తన గొంతు విప్పి..తనను కాదన్న వాళ్లని ఒక్క గెలుపుతో నోరూమూయించింది. అంతేగాదు అవమానాలు, చీత్కారాలు గెలుపుకి ఆటంకాలు కాదు బలం అని చాటి చెప్పి  స్ఫూర్తిగా నిలిచింది.

(చదవండి: మిస్‌ యూనివర్స్‌గా ఫాతిమా బాష్‌)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement