ఇంట్లోనే మాయిశ్చరైజర్‌ తయారుచేసుకోండిలా.. | How To Make Moisturizer With Simple Home Made Tips | Sakshi
Sakshi News home page

ఇంట్లోనే మాయిశ్చరైజర్‌ తయారుచేసుకోండిలా..

Dec 28 2023 4:52 PM | Updated on Dec 28 2023 5:14 PM

How To Make Moisturizer With Simple Home Made Tips - Sakshi

చలికాలంలో చర్మసౌందర్యంపై దృష్టి పెట్టడం మరింత ముఖ్యం. లేదంటే తొందరగా పొడిబారుతుంది. అందుకే ఇంట్లోనే సింపుల్‌ టిప్స్‌తో సహజంగా ఎలా మెరిసిపోవచ్చో చూసేద్దాం.

ఓట్స్‌లో పాలు లేదా పెరుగు కలిపి మిశ్రమం తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా వారం రోజుల పాటు రోజూ చేస్తూ ఉంటే స్కిన్‌టోన్‌ పెరుగుతుంది. 

పొడిచర్మం గలవారు బాదం పొడిలో పాలు లేదా పెరుగు, తేనె, కొన్ని చుక్కల గ్లిజరిన్‌ కలిపి ముఖానికి, చేతులకు రాసుకోవాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. బాదం పొడి, తేనె చర్మానికి అద్భుతమైన మాయిశ్చరైజర్లుగా ఉపయోగపడతాయి.

పొడిబారిన చర్మానికి తేమను అందించడంలో షియా బటర్‌ చక్కగా పనిచేస్తుంది. ఇందులోని ఫ్యాటీ యాసిడ్స్‌, విటమిన్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని మెరిపించడంలో సహకరిస్తాయి. ఇది చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా ఉంచుతుంది. 

 కొబ్బరినూనెకు రెండు క్యాప్సూల్స్‌ విటమిన్‌ ఇ నూనె, లావెండర్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌ వేసి ఓ డబ్బాలో స్టోర్‌ చేసుకోండి. కొబ్బరి నూనెలోని యాంటీ ఆక్సిడెంట్లు తేమను అందించడంతో పాటు చర్మ సమస్యలను కూడా దూరం చేస్తుంది.

స్ట్రాబెర్రీ లేదా కమలాలు చర్మానికి రసాయనాలు లేని బ్లీచ్‌లా ఉపయోపడతాయి. వీటి రసాన్ని ముఖానికి రాసి, 5–10 నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. చర్మంపైన జిడ్డు తగ్గి పిగ్మెంటేషన్, మొటిమల వంటి సమస్యలను నివారిస్తాయి.

గుడ్డులోని తెల్లసొనలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి, గొంతుకు రాయాలి. పదినిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ ప్యాక్‌ చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. ముఖంపైన  అతి సన్నని వెంట్రుకలను కూడా నివారిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement