ముఖానికి ఆవిరి ఎంత సేపు?

How Long Does The Steam Apply On The Face? - Sakshi

బ్యూటీపార్లర్‌లలో ఫేసియల్‌ చేసేటప్పుడు ముఖానికి ఆవిరిపట్టడం (స్టీమ్‌) చూస్తుంటాం. అయితే ఆవిరి ఎంత సమయం పట్టాలి? ఎలా పట్టాలి? అసలు ఆవిరిపట్టడం వల్ల ఉపయోగాలేమిటో తెలుసుకోవడం అవసరం.

♦  మరీ ముఖచర్మానికి దగ్గరగా ఆవిరి వేడి తగలకూడదు. షవర్‌బాత్‌ చేసేటప్పుడు నీరు ఎంత దూరం నుంచి పడతాయో, సుమారు అంత దూరం నుంచి ఆవిరి చర్మానికి తగలాలి. లేదంటే చర్మం తన సహజత్వాన్ని కోల్పోతుంది.
♦  ఐదు నిమిషాలకు మించి ఆవిరి పట్టకూడదు. అన్ని చర్మతత్వాలూ ఒకేలా ఉండవు కాబట్టి అందరికీ ఒకేవిధంగా ఆవిరిపట్ట రాదు. దీని వల్ల చర్మంలోని పోర్స్‌ తెరుచుకుని, సహజసిద్ధంగా నూనె స్రవించే గ్రంథులు పొడిబారుతాయి. దీనివల్ల చర్మం త్వరగా ముడతలు రావడానికి ఆస్కారం అవుతుంది.
♦   ఆవిరి పట్టిన తర్వాత క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల పోర్స్‌లో ఉన్న మలినాలు తొలగిపోతాయి. 
♦  తర్వాత పొడిగా ఉన్న మెత్తని టవల్‌తో ముఖాన్ని తుడుచుకోవాలి. ఒకవేళ చర్మం పొడిబారినట్టుగా అనిపిస్తే గనక ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్‌ వాడాలి.
♦ చర్మతత్వానికి తగిన విధంగా ట్రీట్‌మెంట్‌ ఇచ్చే నిపుణుల చేతనే ఫేసియల్‌ చేయించుకోవడం, స్టీమ్‌ పట్టడం చేయడం మేలు. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top