Sagubadi: అరెకరం ఉచిత విత్తనాలకై.. | How To Get Rid Of Weeds Today Sagubadi News | Sakshi
Sakshi News home page

Sagubadi: కలుపు నిర్మూలన ఎలా?

May 28 2024 8:17 AM | Updated on May 28 2024 8:17 AM

How To Get Rid Of Weeds Today Sagubadi News

ఈ ఏడు ముందస్తు వానలు కురుస్తున్నాయి. ప్రకృతి శుభసూచనలు చేసింది. ప్రకృతిలో కానుగ చెట్లు ఇగురు పూత విరివిగాను, నేరేడు చెట్లు గుబురుగాను ఉన్నాయి. మే నెలలోనే తొలకరి వానలకు ప్రకృతి నాంది పలికింది. వానకు ΄÷లంలో ఉన్న కలుపు విత్తనాలు మొలుస్తాయి. ఆరుద్ర కార్తె నుంచి పంటలు సాగు చేయటానికి అనుకూలంగా ఉండాలంటే భూమిని వారం, పది రోజుల వ్యవధిలో ఒకటికి రెండుసార్లు తేలిక΄ాటి సేద్యం చేయాలి (దుక్కి దున్నాలి). ఇలా చేస్తే మట్టిలోని గడ్డి గింజలన్నీ మొలిచి ఆరుద్ర నాటికి 80 శాతం కలుపు మొక్కలు చని΄ోతాయి. ఆ తర్వాత పంట వేసుకుంటే కలుపు సమస్య పెద్దగా వేధించదు. 

అయితే, చాలా మంది రైతులు ఒకేసారి ఇరుసాలు సేద్యం (దుక్కి) చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మొదటి దుక్కికి భూమిపైన ఉన్న గడ్డి విత్తనాలు మట్టి కిందకు వెళ్తాయి. వానలు పడిన వెంటనే కలుపు మొలుస్తుంది. అయినా, ఇంకా కలుపు విత్తనాలు కొన్ని మట్టిలో మిగిలే ఉంటాయి. మొదటి దుక్కి నుంచి రెండోసారి దుక్కి చేయటానికి కనీసం ఒక వారం, పది రోజుల సమయం ఇవ్వాలి. లేక΄ోతే మన పంటకు కలుపు ఎక్కువ వస్తుంది. పంట దిగుబడి తగ్గుతుంది.

ఈ విధంగా కలుపు నివారణ కోసం రెండు సార్లు సేద్యం (రెండు దుక్కులు) చేయక΄ోతే కూలీల ఖర్చు ఎక్కువగా ఉంటుంది. చాలా మంది రైతులు కొర్ర చేనులో కూడా కలుపు మందులు పిచికారీ చేస్తున్నారు. దీని వల్ల దిగుబడి బాగా తగ్గుతుందని గుర్తించండి. చిరుధాన్యాలు సాగు చేసే రైతులు వారం, పది రోజుల వ్యవధిలో రెండు సార్లు తేలిక ΄ాటి సేద్యం (దుక్కి) చేసి కలుపు నిర్మూలన చేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది.

అరెకరానికి ఉచితంగా విత్తనాలు..
కొర్రలు, అండుకొర్రలు, అరికెలు, ఊదలు, సామల సాగును పెంపొందించే లక్ష్యంతో కొత్తగా సిరిధాన్యాలు సాగు చేయదలచిన కొందరు రైతులకు అరెకరానికి సరి΄ోయే (5 రకాలు ఒక్కో రకం అర కేజీ చొప్పున) 2.5 కిలోల విత్తనాలను ఉచితంగా ఇస్తాను. ట్రాన్స్‌΄ోర్ట్‌ ఖర్చులు వారే భరించాలి (గమనిక: సిరిధాన్యాల సేంద్రియ సాగుపై సందేహాల నివృత్తి కోసం, విత్తనాల కోసం ఏపీ వారు ఉ. 5–30 గం. నుంచి సా. 7.30 గం. వరకు.. తెలంగాణ వారు సా. 7 గం. నుంచి రాత్రి 8.30 వరకు ఫోన్‌ చేయొచ్చు). విజయకుమార్‌: 98496 48498

5 రకాలను అంతటా పండించాలి..
చిరుధాన్యాల సాగు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అన్ని జిల్లాల్లో పెరుగుదల బాగానే ఉంటుందనిపిస్తోంది. ఈ మధ్యన చిరుధాన్యాల ధర విపరీతంగా పెరిగింది. ఉదాహరణకు.. బరిగె ధాన్యం టన్నుకు రూ. 65 వేలు పలుకుతోంది. బరిగె బియ్యం కిలో రూ. 90–100 పలుకుతోంది. కోస్తా ఆంధ్ర జిల్లాలో పెద్ద సామ విరివిగా సాగు చేస్తున్నారు. రాయలసీమ జిల్లాల్లో కొర్ర పంట మాత్రమే సాగు చేస్తున్నారు.

కర్ణాటక జిల్లాల్లో అరిక కొంత మేర సామ, ఊద సాగు చేస్తున్నారు. కొన్ని ్ర΄ాంతాల్లో మాత్రమే అండుకొర్రలు సాగవుతున్నాయి. ఐదు రకాల సిరిధాన్యాల బియ్యం కావాలంటే అన్నీ ఒక చోటకు చేర్చాలంటే రవాణా ఖర్చు ఎక్కువ అవుతున్నది. ఈ రోజు మార్కెట్‌లో చిరుధాన్యాల బియ్యం ధరలు పేదలు తినేటట్టు లేవు. అందుకే కొర్ర, అరిక, సామ, ఊద, అండుకొర్ర ఈ ఐదు రకాల సిరిధాన్యాలను అన్ని ్ర΄ాంతాల్లోనూ సాగులోకి తేవాలి.

ఆరుద్రలో అరిక విత్తాలి..
పెద్ద రైతులు ఒకసారి ఆలోచన చేయండి. చిరుధాన్యాలు సాగు చేస్తే రసాయన ఎరువులు, పురుగుమందుల ఖర్చులు తగ్గి భూసారం పెరుగుతుంది. అరిక పంట ఆరుద్ర కార్తెలో మిశ్రమ పంటగా సాగు చేసుకుంటే బాగుంటుంది. 6 సాళ్లు అరిక ఒక సాలు కంది.. 6 సాళ్లు అరిక, ఒక సాలు ఆముదాలు విత్తుకోవాలి. ఇందులో అలసందలు, అనుములు, నల్లపెసలు, గోగులు, సీతమ్మ జొన్న సాగు చేస్తే చాలా బాగుంటుంది.

ఊద పంట 110–120 రోజులు, అండుకొర్ర పంట 105–115 రోజులు, సామ పంట 110 రోజులు, కొర్ర పంట 75–80 రోజుల వరకు ఉంటుంది. వానలు బాగా పడుతున్నందు వలన అన్ని రకాలు సాగు చేయవచ్చు. నీటి ఆధారం కింద రెండు లేదా మూడు పంటలు సాగు చేయవచ్చు. చిరుధాన్యాల సాగులో తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడి రావాలంటే.. రసాయనిక ఎరువులు వేయటం మానివేసి.. పశువుల ఎరువు, చెరువు మట్టి వేయటంతో ΄ాటు గొర్రెలను మళ్లించటం (మంద కట్టటం), అలాగే ఏగిలి మార్చటం (పంట మార్పిడి) వంటి పనులు చేయాలి. – కొమ్మూరి విజయకుమార్‌, సృష్టి సమ్మాన్‌ పురస్కార గ్రహీత, వేంపల్లె మం, టి.వెలమవారిపల్లె, వైఎస్సార్‌ కడప జిల్లా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement