చక్కగా మసాజ్‌,ఈ బ్రష్‌  జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.. | Sakshi
Sakshi News home page

చక్కగా మసాజ్‌,ఈ బ్రష్‌  జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది..

Published Mon, Oct 2 2023 10:58 AM

Head Massager Hair Scalp Brush To Prevent Hair Loss  - Sakshi

చూడటానికి కంప్యూటర్‌ మౌస్‌లా కనిపించే ఈ పరికరం హెడ్‌మసాజర్‌. ఇది రీచార్జబుల్‌ బ్యాటరీతో పనిచేస్తుంది. దీని అడుగుభాగంలో సున్నితమైన బ్రష్‌ ఉంటుంది. ఆన్‌ చేసుకుని, కోరుకున్న వేగాన్ని సెట్‌ చేసుకుంటే చాలు. తలదిమ్ము వదిలేలా, తలకు హాయి కలిగించేలా ఇంచక్కా మర్దన చేస్తుంది.

దీని బ్రష్‌ జుట్టు కుదుళ్లను ఉత్తేజపరుస్తుంది. ఫలితంగా జుట్టురాలడాన్ని అరికడుతుంది. జుట్టు ఇప్పటికే రాలిపోయిన చోట కొత్త వెంట్రుకలను మొలిపిస్తుంది. జపాన్‌కు చెందిన ‘హెబావోడాన్‌’ కంపెనీ ఈ పరికరాన్ని ఇటీవల మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర 5200 యెన్‌లు (రూ.2,925) మాత్రమే!

Advertisement
 
Advertisement