క్లూషియల్‌: పెదవుల వెనుక మృత్యువు | Funday Crime Story | Sakshi
Sakshi News home page

క్లూషియల్‌: పెదవుల వెనుక మృత్యువు

Jun 7 2026 11:48 AM | Updated on Jun 7 2026 11:48 AM

Funday Crime Story

అర్ధరాత్రి ఒంటిగంట. వ్యాపారవేత్త వేలాయుధం తన విలాసవంతమైన గదిలో శవమై పడి ఉన్నాడు. అతని మరణం నగరంలో సంచలనం సృష్టించింది.కేసు దర్యాప్తు కోసం ఇన్‌ స్పెక్టర్‌ అభిమన్యు రంగంలోకి దిగాడు.లంకంత ఇంట్లో ఒక్కడే ఉంటాడు. ఆ ఇంటి వంట మనిషి పురుషుడే, తోటమాలి, పనిమనిషి కూడా పురుషులే!అభిమన్యు క్రైమ్‌ సీన్‌ ను పరిశీలిస్తున్నప్పుడు కొన్ని కీలక ఆధారాలు దొరికాయి.వేలాయుధం బుగ్గలు, ఛాతీపై ఎర్రటి లిప్‌స్టిక్‌ గుర్తులు ఉన్నాయి.ప్రాథమికంగా ఇదొక మహిళ చేసిన హత్యలా కనిపించింది.పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో వేలాయుధం పెదవులపై ఉన్న విషం వల్ల చనిపోయాడని తేలింది.

ఇన్‌స్పెక్టర్‌ అభిమన్యు ఆ లిప్‌స్టిక్‌ గుర్తులను భూతద్దంతో నిశితంగా పరిశీలించాడు. అతని క్రిమినాలజీ అనుభవం ఒక రహస్యాన్ని బయటపెట్టింది. అభిమన్యు వేలాయుధం కుటుంబ నేపథ్యాన్ని తవ్వడం ప్రారంభించాడు. వేలాయుధం తండ్రి మొదటి భార్య కొడుకు, అతని సవతి తమ్ముడు వేలుపిళ్లై మీద అనుమానం వచ్చింది. కానీ అతనే హంతకుడు అనడానికి ఎవిడెన్‌ కావాలి. వేలాయుధం స్టాఫ్‌ను, పనివాళ్లను, సవతి తమ్ముడిని విచారించాడు. అందరి పెదవుల కొలతలు తీసుకున్నాడు.వేలాయుధంతో ఉన్న వ్యక్తిగత పరిచయం దృష్ట్యా కమిషనర్‌ కూడా వచ్చాడు.‘చాలా మంచివాడు. ఇలా అర్ధాంతరంగా చనిపోవడం బాధాకరం. హంతకుడిని సాధ్యమైనంత త్వరగా పట్టుకోవాలి.’ అన్నాడు  కమిషనర్‌.

‘కేసు క్లోజ్‌ అయినట్టే... సంకెళ్లు రెడీ చేయండి కమిషనర్‌ గారూ... ఏమంటారు? వేలుపిళ్లై...’ వేలాయుధం తమ్ముడి వైపు చూసి అన్నాడు.‘నేనా?.. నేనేమంటాను?’ కంగారుపడుతూ అన్నాడు వేలుపిళ్లై.కమిషనర్‌ ఇన్‌స్పెక్టర్‌ అభిమన్యు వైపు వేలుపిళ్లై వైపు చూశాడు.‘నువ్వు చెబుతావా? నన్ను చెప్పమంటావా? వేలుపిళ్లై వైపు చూస్తూ అన్నాడు ఇన్‌స్పెక్టర్‌ అభిమన్యు.అప్పటికే ఇన్‌స్పెక్టర్‌ అభిమన్యు ఆదేశాల మేరకు వేలుపిళ్లై చేతికి సంకెళ్లు తగిలించారు.వేలుపిళ్లై వేలాయుధానికి సవతి తమ్ముడు. అయినా ప్రేమగానే సొంత అన్నగానే చూశాడు. ఆస్తి కోసం క్రిమినల్‌ బ్రెయిన్‌ ఉపయోగించాడు వేలుపిళ్లై.

‘క్రైమ్‌ సీ¯Œ లో దొరికిన లిప్‌స్టిక్‌ మార్కులను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపాను. ఆడవాళ్ళ పెదవులు చిన్నగా, సున్నితంగా ఉంటాయి. కానీ వేలాయుధం బుగ్గల మీద, ఛాతీ మీద ఉన్న పెదవుల ముద్రలు చాలా వెడల్పుగా, పెద్దగా ఉన్నాయి. అవి కచ్చితంగా ఒక మగాడి పెదవుల సైజు. హంతకుడు మహిళ అని నమ్మించడానికి చేసిన చీప్‌ ట్రిక్‌ ఇది.’తన పెదవులకు విషం అంటకుండా... ల్యాబ్‌లలో వాడే సిలికాన్‌ ప్లాస్టిక్‌ లేయర్‌ను తన  పెదవులపై అతికించుకున్నాడు . దానిపై విషపూరితమైన లిప్‌స్టిక్‌ రాశాడు. నిద్రపోతున్న వేలాయుధాన్ని నొక్కిపట్టి, ఆ లేయర్‌ ద్వారా విషాన్ని అతని శరీరంలోకి ఎక్కించాడు’ అని వేలుపిళ్లై వైపు తిరిగి .‘నువ్వు ఆ లేయర్‌ను తీసి నీ ఇంటి వెనుక ఉన్న డస్ట్‌బిన్‌ లో పడేశావు. మా పోలీసులు దాన్ని వెతికి పట్టుకున్నారు. దాని మీద నీ లాలాజలం ఉంది. అలాగే వేలాయుధం శరీరంపై ఉన్న విషపు లిప్‌స్టిక్‌ కూడా ఉంది.

వేలుపిళ్లైను పోలీసులు జీపు ఎక్కిస్తుండగా చెప్పాడు ఇన్‌స్పెక్టర్‌ అభిమన్యు.‘ఏ ఆస్తి కోసం అయితే నీ అన్నయ్యను హత్య చేశావో.. అదే అన్నయ్య తన  తదనంతరం తన యావదాస్తిని నీకు చెందేలా విల్లు రాశాడు. హత్య చేసిన నీకు ఆస్తి రాదు. అనుభవించే అవకాశమూ లేదు. నీ నేరప్రవృత్తి నిన్ను కటకటాల్లోకి నెట్టింది’ చెప్పాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement