Wedding Season Fashion: లెహంగా ఒక్కటే కాదు.. పెళ్లిలో మరింత ఆకర్షణీయంగా కనిపించాలంటే!

Fashion In Wedding Season: Matching Trends Lehenga Earrings Chappals - Sakshi

మ్యాచ్‌ చేద్దాం

Latest Fashion In Wedding Season- Matching Trends: వధువుకు వరుడిని మ్యాచ్‌ చేసినట్టే.. డ్రెస్‌కి ఆభరణాలను మ్యాచ్‌ చేసినట్టే... చేత పట్టుకునే బ్యాగ్‌నూ కాళ్లకు ధరించే చెప్పులనూ మ్యాచ్‌ చేద్దాం. చెవి జూకాలను, కాలి జూతీలను మ్యాచ్‌ చేద్దాం. లెహంగా అంచులను షూస్‌ ఎంబ్రాయిడరీతో మ్యాచ్‌ చేద్దాం. మ్యాచింగ్‌లో కొత్త ట్రెండ్‌కు వేదిక వేద్దాం.

ఇది వివాహాది శుభకార్యాలు ఎక్కువగా జరిగే సీజన్‌. సాధారణంగా పెళ్లిలో పట్టు రెపరెపలు, ఎంబ్రాయిడరీ జిలుగులు కళ్లను మెరిపిస్తుంటాయి. వాటికి మ్యాచింగ్‌గా ఆభరణాల ఎంపిక ఉంటుంది. ఇప్పుడిక లెహంగా డిజైన్‌కు సరిపోయే మ్యాచింగ్‌ క్లచ్‌లు, పాదరక్షల ఎంపిక సరికొత్త ట్రెండ్‌ అయ్యింది. అందుకే నవ వధువులు కూడా తమ అలంకరణలో ప్రత్యేకత చాటాలనుకుంటున్నారు.

వధువు తన వరుడి ఇంటి పేరును బ్యాగులపై జత చేర్చి భద్రంగా మండపానికి తీసుకువస్తుంది. లెహంగా పైన ఉన్న ఎంబ్రాయిడరీ జిలుగులను పొట్లీ వాలెట్‌తో మ్యాచ్‌ చేస్తుంది. విభిన్నంగా కనిపించాలనే తాపత్రయానికి కొత్త కొత్త హంగులు అదనంగా వచ్చి చేరుతున్నాయి. 

ఒక సర్వే ప్రకారం తేలిందేమంటే.. ఎవరైనా మనల్ని కలిస్తే, ముందుగా వారి కళ్ళు మన పాదాలపైకి వెళ్తాయి. అందువల్ల మేకప్, డ్రెస్సింగ్‌పై ఎంత శ్రద్ధ చూపుతారో, పాదరక్షల పట్ల కూడా సమాన శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. గతంలో వధువులకు పాదరక్షల గురించి పెద్దగా అవగాహన ఉండేది కాదు.

గోల్డెన్, రెడ్‌  మెరూన్‌ వంటి సాధారణ రంగుల ఫుట్‌వేర్‌ మాత్రమే మార్కెట్‌లో అందుబాటులో ఉండేవి. బ్రైడల్‌ లెహంగాలు కూడా పరిమిత రంగులతో ఉండటమే దీనికి కారణం. నేడు వధువులు తమ మేకప్‌లోకి ప్రతి రంగునూ ఆహ్వానిస్తున్నారు. అందుకు సరిపోయే పాదరక్షలు, హ్యాండ్‌ బ్యాగ్‌లకూ ప్రాధాన్యత ఇస్తున్నారు.

వివాహాది శుభకార్యాల వంటి ప్రత్యేక సందర్భాలలో రూపొందించిన పాదరక్షలు, బ్యాగ్‌ల మెటీరియల్‌ను. సిల్క్, వెల్వెట్, శాటిన్, వేగన్‌ లెదర్‌తో రూపొందిస్తారు. వాటిపై మోటిఫ్, జర్దోసీ, మోతీ, జరీ, దబ్కా, థ్రెడ్‌ వర్క్‌తో మెరిపిస్తారు. దీనివల్ల ఈ అలంకారాలన్నీ మరింత అందంగా కనిపిస్తాయి.  

చదవండి👉🏾Beauty Tips: మామిడి పండు గుజ్జు, ఓట్స్‌.. ట్యాన్‌, మృతకణాలు ఇట్టే మాయం!
చదవండి👉🏾Hair Care Tips: వాల్‌నట్స్‌ తింటున్నారా.. ఇందులోని ఆల్ఫాలినోలెనిక్‌ యాసిడ్‌ వల్ల

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top