పిల్లలు సెల్‌ఫోన్‌, టీవీకి అడిక్ట్‌ అయ్యారా? ఇలా చేయండి.. కడుపులో నులిపురుగులు ఉంటే..

Easy Ways To Break Your Kids Smartphone And TV Addiction - Sakshi

మా అబ్బాయి / అమ్మాయి సెల్ఫోన్ / టీవీకి అడిక్ట్ అయిపోయారు. పుస్తకం ముట్టుకోవడానికి ఇష్టపడం లేదు !” అని కొంత మంది పేరెంట్స్ అంటున్నారు. నిజానికి మనం నేర్పే వాటినే పిల్లలు నేర్చుకొంటారు. మన ప్రమేయం లేకుండా పిల్లలు, ముఖ్యంగా అయిదేళ్ల లోపు పిల్లలు ఏదీ నేర్చుకోరు. పిల్లలు మనల్ని అనుకరిస్తారు.

ఇలా చెయ్యండి
1 . ఎటువంటి పరిస్థితుల్లో పిల్లల చేతికి సెల్ ఫోన్ ఇవ్వొద్దు. “ అది పెద్దల కోసం.. అవసరానికి మాత్రం వినియోగించడానికి “ అని చెప్పండి.
2 . మీరు టీవీ ముందు, సెల్‌ఫోన్‌తో గడిపే కాలాన్ని తగ్గించండి.
3 . ఆసక్తి కలిగిన పుస్తకాలు చదవండి. పిల్లలు దాన్ని అనుకరిస్తారు.
4 . పిల్లలతో సమయం గడపండి. వారికి రకరకాల ఆటలు నేర్పండి. వారితో ఆడండి.

5 . పిల్లలకు కథలు చెప్పండి. దాని గురించి వారితో చర్చించండి. దీని వల్ల క్రిటికల్ థింకింగ్ పెరుగుతుంది. అన్నిటికీ మించి మీ పిల్లలు మీరు చెప్పింది వినడం చేస్తారు. పెద్దయ్యాక కూడా ఇది కొనసాగుతుంది . మీ అభిప్రాయాన్ని గౌరవిస్తారు .
6 . పిల్లలు ఆకలేస్తే తింటారు. కడుపులో నులిపురుగులు లాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఆకలి తగ్గుతుంది. దానికి ట్రీట్మెంట్ అవసరం. నాలుగు గంటలకు స్వీట్స్ ఐస్ క్రీం లాంటి హై కెలొరీ ఫుడ్ ఇచ్చి, మరో మూడు గంటల్లో అన్నం తినమంటే తినరు. పిల్లల్ని అన్నం తినిపించే పేరుతొ ఏదైనా చేసి వారికి తినడం పైన ఇంటరెస్ట్ పోయేలా చేయకండి. పిల్లల్ని జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంచండి.
-వాసిరెడ్డి అమర్నాథ్, పాఠశాల విద్య పరిశోధకులు

చదవండి: షుగర్‌ ఎందుకొస్తుంది?.. రాకుండా ఎలా కాపాడుకోవాలి?
విటమిన్‌ ట్యాబ్లెట్లు వేసుకుంటే ఆరోగ్యానికి మంచిదా? ఎంతవరకు! డాక్టర్లు చెప్తున్నదేంటి?

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top