 
													మన ఆహార అలవాట్లు, జీవన శైలి అలవాట్లే మన ఆరోగ్యాన్ని నిర్ధారిస్తాయి. ప్రాసెస్ చేసిన మాంసాహారం నుంచి చక్కెర పానీయాల వరకు మనం తీసుకునే రోజువారీ ఆహారాలు కేన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ విషయాన్ని కాలిఫోర్నియాలోనిగ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ,ఐయిమ్స్, హార్వర్డ్ , స్టాన్‌ఫోర్డ్‌లో శిక్షణ పొందిన డాక్టర్ సౌరభ్ సేథి వెల్లడించారు. కేన్సర్ ముప్పును పెంచే అత్యంత హానికరమని భావించే ఆహారాలను సేథి ఇటీవల సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ప్రస్తుత సమాజంలో అత్యంత ప్రమాదకర వ్యాధుల్లో కేన్సర్ కూడా ఒకటి. వంశపారంపర్య కారణాలతోపాటు, ఆహారం. దురవ్యసనాలు, జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారం, అనారోగ్యకరమైన ఆహారం కూడా కాలక్రమేణా కేన్సర్ ప్రమాదాన్ని నిశ్శబ్దంగా పెంచుతాయి. అయితే అల్ట్రా-ప్రాసెస్డ్ మాంసాహారం, చక్కెర పానీయాలు, డీప్-ఫ్రైడ్ ఆహారాలు,కాల్చిన మాంసాహారం ఆల్కహాల్ , అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాలు కేన్సర్ ముప్పును మరింత పెంచుతాయని డా. సేథి
అల్ట్రా-ప్రాసెస్డ్, గ్రిల్డ్ మాంసాహారం
దీర్ఘకాలిక ఆరోగ్యం కావాలనుకుంటే మన ఆహారంలో తొలగించాల్సిన  కొన్ని ప్రధాన  ఆహారాలు ఇవేనని డాక్టర్ సేథి తన పోస్ట్‌లో అన్నారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రాసెస్ చేసిన మాంసాలను గ్రూప్ 1  కేన్సర్ కారకాలుగా వర్గీకరించింది.  ఈ ఆహారాన్ని  కూడా   ప్రమాదకరమైన కేన్సర్ కారకాలైన పొగాకు , ఆస్బెస్టాస్ జాబితాలో చేర్చింది. అలాగే డా. సేథి కూడా ప్రాసెస్ చేసిన మాంసాహారం కేన్సర్ కారకరమన్నారు. మాంసాన్ని ఎక్కువగా కాల్చటం లేదా నల్లగా వచ్చే వరకు గ్రిల్ చేయటం ప్రమాకరమన్నారు. ఇలాంటి సాసేజ్‌లు, బేకన్, హామ్  సలామీ వంటి ప్రాసెస్ చేసిన  ఆహారాల్లో, అధిక ఉష్ణోగ్రతల వద్ద మాంసాన్ని గ్రిల్ చేయడం లేదా బార్బెక్యూ చేయడం వల్ల  హెటిరోసైక్లిక్ అమైన్స్, పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్లు ఉత్పత్తి అవుతాయని, ఇవి శరీరంలోని డీఎన్ఏ కణాలను డ్యామేజ్ చేస్తాయని ఆమె చెప్పారు. ఇవి శరీరంలో క్యాన్సర్ కారక సమ్మేళనాలుగా మారతాయి. ఇలా ఎక్కువ సార్లు  జరిగితే సెల్స్ శరీరంలో పెరగటానికి కారణం అవుతుందని హెచ్చరించారు.
చక్కెర పానీయాలు
కూల్ డ్రింక్స్, సోడాలు, తీపి రసాలు , ఎనర్జీ డ్రింక్స్ లాంటి చక్కెర పానీయాలు రక్తంలో చక్కెర . ఇన్సులిన్ స్థాయిలలో పెరుగుదలకు కారణమవుతాయి, ఇది దీర్ఘకాలిక మంట ,బరువు పెరగడానికి దారితీస్తుంది. ఇది రెండూ కేన్సర్ కారకాలు. అధిక చక్కెర తీసుకోవడం కూడా కేన్సర్ కణాల పెరుగుదలకు ఆజ్యం పోస్తుంది. కనుక వీటికి చాలా దూరంగా ఉండాలని, దీని బదులుగా నీరు, తియ్యని టీలు లేదా సహజంగా రుచిగల పానీయాలను ఎంచుకోవాలని సిఫార్సు చేశారు..
డీప్ ఫ్రైడ్, ప్రాసెస్డ్ పదార్థాలు, ఆహారాలు
ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ చికెన్ , పకోరాస్ వంటివి తినేటపుడు బాగానే ఉంటాయి. కానీ వీటి వల్ల చాలా అనర్థం.అధిక ఉష్ణోగ్రతల వద్ద  మరిగించిన నూనెలను మళ్లీ మళ్లీ  ఉపయోగించి తయారుచేస్తారు. ఈ ప్రక్రియలో అక్రిలామైడ్ వంటి హానికరమైన సమ్మేళనాలు ఉత్పత్తి అవుతాయి, ఇవి DNA నష్టం , ఆక్సీకరణ ఒత్తిడికి కారణమవుతాయి. వీటికిప్రత్యామ్నాయాలుగా బేకింగ్, రోస్టింగ్ లేదా ఎయిర్-ఫ్రైయింగ్‌ను డాక్టర్ సేథి సిఫార్సు చేశారు.
చదవండి: హాటెస్ట్ కర్రీ చాలెంజ్.. ఈ బ్రో తిప్పలు చూడండి!
ఆల్కహాల్: హార్మోన్ సంబంధిత  కేన్సర్లు
మద్యం సేవించటం వల్ల శరీరంలో హార్మోన్ల పనితీరు దెబ్బతింటుంది. ఫలితంగా  బ్రెస్ట్ కేన్సర్, లివర్ కేన్సర్ వంటివి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఆల్కహాల్ శరీరంలో ఎసిటాల్డిహైడ్‌గా విచ్ఛిన్నమవుతుంది - ఇది DNAను దెబ్బతీసే, రోగనిరోధక శక్తిని దెబ్బతీసే మరియు పోషక శోషణను తగ్గించే విషపూరిత సమ్మేళనం.  శరీరం న్యూట్రిషన్లను గ్రహించటానికి అవరోధంగా మారడం ద్వారా డీఎన్ఏ రిపేర్ ప్రక్రియ దెబ్బతిని కేన్సర్ డెవలప్ అయ్యే ప్రమాదాలు పెరుగుతాయని డా. సేథి హెచ్చరించారు.
అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాలు
ప్యాకేజ్డ్ స్నాక్స్, ఇన్‌స్టంట్ నూడుల్స్, ప్రాసెస్ చేసిన తృణధాన్యాలు  రడీ టూ  ఈట్ పదార్థాల్లో  తరచుగా అదనపు చక్కెరలు, ట్రాన్స్ ఫ్యాట్‌లను  కలిగి ఉంటాయి. ఇవి తక్కువ పోషక విలువలతో కూడి ఉండటమే కాదు,  పేగు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి, వాపుకు దోహదం చేస్తాయి , ఊబకాయాన్ని పెంచుతాయి. ఇవన్నీ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.
ఇదీ చదవండి: హాట్సాఫ్ డాక్టర్ ! క్షణం ఆలస్యమైనా.!
కేన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకునేందు  ఏం తినాలి?
ప్రపంచ ఆరోగ్య సంస్థల ప్రకారం, ఫైబర్ అధికంగా ఉండే, యాంటీ ఇన్ఫ్లమేటరీ హోల్ ఫుడ్స్  ఆహారాన్ని తీసుకోవాలి.  ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలి.
- పాలకూర, కాలే మరియు బ్రోకలీ వంటి ఆకుకూరలు 
- ఓట్స్, బ్రౌన్ రైస్ , క్వినోవా వంటి తృణధాన్యాలు 
- కాయధాన్యాలు, చిక్‌పీస్ , బీన్స్‌తో సహా చిక్కుళ్ళు , ఇతర పప్పులు 
- నట్స్,గింజలు,, అవకాడోల నుండి ఆరోగ్యకరమైన కొవ్వులు 
- గట్ ఆరోగ్యం కోసం పెరుగు , కంజి వంటి పులియబెట్టిన ఆహారాలు, , కొబ్బరి నీళ్లు 
 
నోట్ : కేన్సర్ వ్యాధికి అనేక కారణాలుంటాయి. వీటిల్లో మన ఆహార అలవాట్లు, వృత్తిపరమైన సమస్యలు, జెనెటిక్‌గా వచ్చేవి ఉంటాయి. కేన్సర్ ముప్పు పెరగకుండా ఉండాలంటే కచ్చితంగా కొన్ని రకాల ఆహారాలకు, అలవాట్లకు దూరంగా ఉండాలి. అలాగే కేన్సర్ వ్యాధి నిర్ధారణ, స్థాయిని బట్టి , నిపుణుల సలహామేరకు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఏ వ్యాధికైనా ముందస్తు గుర్తింపు చాలా కీలకం అనేది గుర్తంచుకోవాలి.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
