హెయిర్‌ సెట్‌ చేయడానికి.. ఈ 'క్యాప్స్‌లాక్‌'! | The Baseball Cap And Caps Lock Tricks Shared By Kondi Deepika Funday Special | Sakshi
Sakshi News home page

హెయిర్‌ సెట్‌ చేయడానికి.. ఈ 'క్యాప్స్‌లాక్‌'!

Jun 14 2026 9:39 AM | Updated on Jun 14 2026 9:39 AM

The Baseball Cap And Caps Lock Tricks Shared By Kondi Deepika Funday Special

బేస్‌బాల్‌ క్యాప్‌, ట్రక్కర్‌ క్యాప్స్‌

హెయిర్‌ సెట్‌ చేయడానికి టైమ్‌ లేకపోయినా, బార్బర్‌ చేసిన పని కాస్త అతిగా అనిపించినా, లేదా ‘ఈరోజు కాస్త స్టయిలిష్‌గా కనిపించాలి’ అనిపించినా, ఒక క్యాప్‌ పెట్టుకుంటే చాలు– లుక్‌ ఆటోమేటిక్‌గా కూల్‌లాక్‌ అయిపోతుంది. అయితే, ఈ క్యాప్‌ కేవలం తలకు కవర్‌లా కాకుండా, మీ స్టయిల్‌కి ఒక కిరీటంలా కనిపించాలంటే ఈ టిప్స్‌ తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే!

బేస్‌బాల్‌ క్యాప్‌ ఎప్పటికీ క్లాసిక్‌!
ఫ్యాషన్‌  ట్రెండ్స్‌ మారినా, బేస్‌బాల్‌ క్యాప్‌ మాత్రం ఎప్పుడూ ఔటాఫ్‌ స్టయిల్‌ కాదు. జీన్‌ ్స, టీషర్ట్, షార్ట్స్‌– ఏ ఔట్‌ఫిట్‌తో అయినా ఈజీగా మ్యాచ్‌ అవుతుంది. ముఖ్యంగా నేవీ, బ్లాక్, వైట్‌ కలర్స్‌లో ఉంటే ఎప్పుడైనా కళ్లుమూసుకుని వేసేయొచ్చు.

లోగో మ్యాజిక్‌!
కొన్ని క్యాప్స్‌పై చిన్న లోగో ఉంటేనే సరిపోతుంది. ఆ చిన్న లోగోనే పెద్ద స్టేట్‌మెంట్‌ అవుతుంది. స్పోర్ట్స్‌ లోగోలు లేదా మినిమల్‌ బ్రాండ్‌ ఎంబ్రాయిడరీలు ఉన్న క్యాప్స్‌ ఇప్పుడు ఫుల్‌ ట్రెండ్‌లో ఉన్నాయి.

ట్రక్కర్‌ క్యాప్స్‌కి గాలి ఫుల్‌!
వెనుక భాగం మెష్‌తో ఉండే ట్రక్కర్‌ క్యాప్స్‌ సమ్మర్‌కి బెస్ట్‌. గాలి బాగా ఆడుతుంది, చెమట తక్కువగా ఇబ్బంది పెడుతుంది. బైక్‌ రైడ్స్, ట్రావెల్స్, వీకెండ్‌ ఔటింగ్స్‌కి ఇవి పర్ఫెక్ట్‌.

క్లాసిక్‌ స్ట్రీట్‌ స్టైల్‌
ఒక వైట్‌ టీషర్ట్, ఓవర్‌సైజ్డ్‌ డెనిమ్‌ జాకెట్, బ్లాక్‌ లేదా నేవీ క్యాప్‌ జత చేస్తే చాలు. ఇది ఎప్పటికీ ఫెయిల్‌ అవని కాంబినేషన్‌ . సింపుల్‌గా కనిపించినా స్టయిల్‌లో మాత్రం ఫుల్‌ మార్కులు కొట్టేస్తుంది.

వెకేషన్‌  వైబ్‌
లైట్‌ వెయిట్‌ లినెన్‌  షర్ట్, షార్ట్స్‌తో పాటు బీజ్‌ లేదా క్రీమ్‌ కలర్‌ క్యాప్‌ పెట్టుకుంటే హాలిడే మోడ్‌ ఆటోమేటిక్‌గా ఆన్‌  అయిపోతుంది. బీచ్‌కి వెళ్లకపోయినా, చూసేవాళ్లకు మాత్రం మీరు వెకేషన్‌ లో ఉన్నట్టే అనిపిస్తుంది.

ఆల్‌ బ్లాక్‌ ఆటిట్యూడ్‌
బ్లాక్‌ టీషర్ట్, బ్లాక్‌ జీన్‌ ్స, బ్లాక్‌ క్యాప్‌– ఈ కాంబో ఎప్పుడూ పవర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. అయితే మొత్తం లుక్‌ బ్లాక్‌లోనే ఉంటే, ఒక వాచ్‌ లేదా వైట్‌ స్నీకర్స్‌తో చిన్న కాంట్రాస్ట్‌ ఇవ్వడం మర్చిపోవద్దు.

జాగ్రత్తలు!
- క్యాప్‌ పెట్టుకున్నారంటే స్టిక్కర్లు, ట్యాగులు తీసేయండి. లేదంటే కొత్తగా కొన్నానని ప్రపంచానికి ప్రకటన ఇచ్చినట్టే ఉంటుంది.
- మురికి పట్టిన క్యాప్‌తో స్టయిల్‌ కంటే అలసత్వమే ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి రెగ్యులర్‌గా క్లీన్‌  చేయండి.
- ఇండోర్‌లో ఉన్నప్పటికీ ఎప్పుడూ క్యాప్‌ తీసేయకుండా ఉంటే, అది అలవాటు ఎక్కువైనట్టే. సందర్భాన్ని బట్టి క్యాప్‌ను క్యారీ చేయాలి. - కొండి దీపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement