ఆటోమేటిక్‌ దోసె మేకర్‌.. నిమిషంలో ఆకలి తీరుస్తుంది  | Sakshi
Sakshi News home page

ఆటోమేటిక్‌ దోసె మేకర్‌.. నిమిషంలో ఆకలి తీరుస్తుంది 

Published Mon, Nov 27 2023 10:10 AM

Automatic Dosa Maker Which Cooks Very Easy - Sakshi

దోసె ఇష్టపడని వాళ్లు అరుదు. ఈ చిత్రంలోని మేకర్‌ ఒకే ఒక్క నిమిషంలో దోసెలేసి ఆకలి తీరుస్తుంది. దీనిలోని 360 డిగ్రీస్‌ ఫుడ్‌ గ్రేడ్‌ కోటెడ్‌ రోలర్‌.. దోరగా వేగిన దోసెలను ట్రేలో అందిస్తుంది. అందుకు వీలుగా వెనుకవైపున్న ట్యాంకర్‌లో దోసెల పిండి వేసి.. పక్కనే ఉండే బటన్‌ ప్రెస్‌ చేస్తే చాలు.

ఈ డివైస్‌.. కంపాక్ట్‌ అండ్‌ పోర్టబుల్‌గా, యూజర్‌ ఫ్రెండ్లీగా పని చేస్తుంది. దీనిలోని ఆటోమేటిక్‌ సేఫ్టీ కట్‌ ఆఫ్‌ ఫీచర్‌తో.. దోసెకు దోసెకు మధ్య 3 నిమిషాల గ్యాప్‌ ఇస్తుంది. ఈ మోడల్‌ మేకర్స్‌లో చాలా కలర్స్‌ అందుబాటులో ఉన్నాయి. మరింకెందుకు ఆలస్యం? ఈసారి దోసెలు వేసే పనిని ఈ మేకర్‌కి అప్పగించేయండి! 

Advertisement
 
Advertisement
 
Advertisement