ఫైటర్‌ని నేను | Actress Nidhi Pradeep shares her Life journey | Sakshi
Sakshi News home page

ఫైటర్‌ని నేను

Jun 14 2026 1:04 AM | Updated on Jun 14 2026 1:04 AM

Actress Nidhi Pradeep shares her Life journey

నవ్వితే అమాయకత్వం, మాట్లాడితే ఆత్మవిశ్వాసంతో ‘గోదారి గట్టుపైన’లో ‘మాయ’గా ప్రేక్షకుల మనసు దోచుకున్న నటి నిధి ప్రదీప్‌.  కేరళ మూలాలున్న ఈ కొత్తతరం కథానాయిక తన కలలు, కెరీర్, సరదా అలవాట్లు, జీవితతత్త్వం గురించి మనతో పంచుకుంటోంది.. ఆమె మాటల్లోనే!

డాక్టర్‌ కావాల్సింది!
మా ఇంట్లో అందరి కోరిక నేను డాక్టర్‌ కావాలనేదే. కానీ నాకు, కెమిస్ట్రీకి అస్సలు పడేది కాదు! ఎంత ప్రయత్నించినా ఆ సబ్జెక్ట్‌తో కనెక్షన్‌ కుదరలేదు. చివరికి స్టెతస్కోప్‌కి బదులుగా కెమెరా ముందు నిలబడాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే.. అదే సరైన నిర్ణయం అనిపిస్తుంది.

జూనియర్‌ నయనతార!
టిక్‌టాక్‌ వీడియోలు చేసే రోజుల్లో చాలామంది నన్ను ‘జూనియర్‌ నయనతార’ అని పిలిచేవారు. నా ఎక్స్‌ప్రెషన్స్ , ఫేస్‌ యాంగిల్స్‌ చూసి అలా అనేవారు. నిజం చెప్పాలంటే నయనతార గారిని కలవడం, ఆమెతో ఒక ఫొటో దిగడం ఇప్పటికీ నా డ్రీమ్‌లిస్ట్‌లో ఉంది!

తెలుగు కోసం అద్దం ముందు క్లాస్‌!
పెరిగింది చెన్నైలో కాబట్టి తెలుగు అస్సలు రాదు. డైలాగ్స్‌ అన్నీ ముందుగా ఇంగ్లీష్‌లో రాసుకుని, వాటిని తెలుగులోకి అనువదించుకుని అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్‌ చేసేదాన్ని. అలా ఒక్కో పదం సరిగ్గా పలకడానికి చాలా కష్టపడ్డాను.

నటుడంటే స్పాంజ్‌లా ఉండాలి!
నటుడు అంటే ఒక స్పాంజ్‌లా ఉండాలి. చుట్టూ ఉన్న వాళ్ల హావభావాలు, మాట్లాడే తీరు, రియాక్షన్స్  అన్నీ గమనించి నేర్చుకోవాలి. అందుకే నేను ఎక్కడ ఉన్నా, మనుషుల్ని అబ్జర్వ్‌ చేస్తూనే ఉంటాను.

‘మాయ’లా కాదు.. నేను ఫైటర్‌!
‘గోదారి గట్టుపైన’లో నా పాత్ర మాయ చాలా సైలెంట్, ఫ్యామిలీ కోసం తన కోరికలు వదులుకునే అమ్మాయి. కానీ నిజ జీవితంలో నేను అలా కాదు. నా కలల కోసం, నా నిర్ణయాల కోసం గట్టిగా నిలబడతాను. నేను రియల్‌ ఫైటర్‌ని!

ఆయనకు పెద్ద ఫ్యాన్ !
టాలీవుడ్‌లో విజయ్‌ దేవరకొండ అంటే చాలా ఇష్టం. ఆయన స్క్రీన్‌ ప్రెజెన్స్ , ఆ యాటిట్యూడ్‌ అద్భుతంగా ఉంటాయి. భవిష్యత్తులో ఆయనతో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవాలని ఉంది. అలాగే జూనియర్‌ ఎన్టీఆర్‌ యాక్టింగ్, డ్యాన్స్  చూస్తే మైండ్‌ బ్లోయింగ్‌ అనిపిస్తుంది.

అమ్మ కళ్లే నాకు వచ్చాయి!
చాలామంది నా కళ్ల గురించి మాట్లాడుతుంటారు. నిజానికి అవి పూర్తిగా మా అమ్మ నుంచి వచ్చిన గిఫ్ట్‌. నా ముఖంలో నాకు అత్యంత ఇష్టమైన ఫీచర్‌ కూడా అదే.

సీ ఫుడ్‌ అంటే వీక్‌నెస్‌!
నేను పక్కా నాన్ వెజ్‌ లవర్‌ని. చికెన్ , మటన్ , ఫిష్, స్క్విడ్స్‌– ఏదైనా ఎంతో ఇష్టంగా తింటాను. షూటింగ్‌ సమయంలో భీమవరం ఫుడ్‌తో ప్రేమలో పడిపోయాను. అక్కడి రొయ్యలు, పీతలు, తాజా చేపల కూరలు తింటుంటే నాకు మా కేరళ గుర్తొచ్చేది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement