ఏలూరు కూటమిలో ముసలం | - | Sakshi
Sakshi News home page

ఏలూరు కూటమిలో ముసలం

Oct 16 2026 7:41 AM | Updated on Oct 16 2026 7:41 AM

న్యూస్‌రీల్‌

శురకవారం శ్రీ 16 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు కూటమిలో మే యర్‌ పీఠం చిచ్చురగిల్చింది. సీటు తమకు కావాలంటే.. తమకు కావాలంటూ జనసేన, టీడీపీ పోటాపోటీ హడావుడికి తెరతీసింది. టికెట్‌ ఇవ్వకపోతే ఫ్రెండ్లీ పోటీకి సిద్ధమని జనసేన ప్రకటించగా టీడీపీ ఇంకో అడుగు ముందుకేసి మా అభ్యర్థులంటూ కొందరిని ప్రచారం చేసింది. కట్‌చేస్తే.. మంగళవారం నుంచి పూర్తిగా సీన్‌ రివర్స్‌ అయింది. రెండు పార్టీలకు స్పష్టత లేకుండా తీవ్ర గందరగోళం కొనసాగింది. గురువారం రాత్రి పొత్తుల్లో జనసేనకు ఏలూరు నగర మేయర్‌ స్థానం కేటాయించమనడంతో టీడీపీ శ్రేణులు భగ్గుమన్నారు. నిరసనగా 62 మంది డివిజన్‌ ఇన్‌చార్జులు, పార్టీ క్లస్టర్‌ ఇన్‌చార్జులు పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం ఏలూరులో హాట్‌టాఫిక్‌గా మారింది.

చివర వరకూ హైడ్రామా

ఏలూరు నగర మేయర్‌ సీటు కోసం టీడీపీ, జనసేన పోటాపోటీ వ్యవహారంలో చివరికి జనసేన సీటు దక్కించుకుంది. చివరి నిమిషం వరకు హైడ్రామాలు, ఎత్తులు పైఎత్తులతో లాబీయింగ్‌ చేసినా టీడీపీ శ్రేణులకు నిరాశే మిగిలింది. బీసీ–జనరల్‌ కావడంతో టీడీపీ నుంచి షాడో ఎమ్మెల్యేగా పేరొందిన కంప్యూటర్‌ ప్రసాద్‌, జనసేన నుంచి రెడ్డి అప్పలనాయుడు అభ్యర్థిత్వం ఆశిస్తూ పోటీపడ్డారు. కంప్యూటర్‌ ప్రసాద్‌కు ఎలాగైనా మేయర్‌ స్థానం ఖరారు చేయించాలని ఎమ్మెల్యే బడేటి చంటి రాజకీయంగా పావులు కదిపారు. ఏలూరు మేయర్‌ టీడీపీదే అంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిన్నటివరకు హడావుడి చేశారు. మరోవైపు ఫ్రెండ్లీ పోటీకి జనసేన సిద్ధంగా ఉందని ప్రకటించడంతో రాజకీయం వేడెక్కింది. పొత్తుల్లో జనసేనకు టికెట్‌ దక్కినా అభ్యర్థి టీడీపీ వ్యక్తి ఉంటే ఉపయోగం ఉంటుందనే దిశగా ఎమ్మెల్యే క్యాంపు అడుగులు వేసింది. దానికనుగుణంగా బలమైన లాబీయింగ్‌ చేసి మాజీ మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ భర్త, టీడీపీ నేత ఎస్‌ఎంఆర్‌ పెదబాబును జనసేనలో చేర్చడానికి రంగం సిద్ధం చేశారు. గురువారం మధ్యాహ్నం జనసేనలో చేరతారని స్థానికంగా టీడీపీ శ్రేణులే సోషల్‌ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. బీసీ జనరల్‌ కేటగిరీలో జనసేన అభ్యర్థిగా ఎస్‌ఎంఆర్‌ పెద బాబుకు ఖరారు అయ్యిందని హడావుడి కూడా చేశారు. దానికనుగుణంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి విజయవాడలో మకాం వేసి ప్రయత్నాలు చేశారు. అయితే ఇవేమీ వర్కవుట్‌ కాకపోవడంతో చివరికి వెనుదిరిగారు. ఈ పరిణామాల క్రమంలో పొత్తుల్లో భాగంగా జనసేనకు కేటాయించిన స్థానాల్లో ఇన్‌చార్జులకు టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా సమాచారం ఇవ్వడంతో ఎమ్మెల్యే బడేటి చంటి వర్గం విలేకరుల సమావేశం పెట్టి రెడ్డి అప్పలనాయుడుపై విరుచుకుపడ్డారు. 2024 ఎన్నికల్లో సహకరించలేదని, జనసేనకే ఎక్కువ అవకాశాలు ఇచ్చి టీడీపీని నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మరోవైపు శుక్రవారం బీ–ఫాం తీసుకుని, 17న నామినేషన్‌ దాఖలు చేయడానికి రెడ్డి అప్పలనాయుడు సన్నద్దమవుతున్నారు.

కుమ్ములాటలు

మేయర్‌ సీటు కోసం టీడీపీ, జనసేన మధ్య ఎడతెగని పంచాయితీ

జనసేనకు పొత్తుల్లో కేటాయింపు

ఫలించని ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాజకీయం

టీడీపీ నేత పెదబాబును జనసేనలో చేర్చి మేయర్‌ సీటు కోసం పాకులాట

చివరిలో బెడిసికొట్టిన ప్రయత్నాలు

62 డివిజన్ల టీడీపీ నేతలు, క్లస్టర్‌ ఇన్‌చార్జులు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement