నామినేషన్‌ వేస్తున్నారా.. ఇవి తప్పనిసరి! | - | Sakshi
Sakshi News home page

నామినేషన్‌ వేస్తున్నారా.. ఇవి తప్పనిసరి!

Oct 16 2026 7:41 AM | Updated on Oct 16 2026 7:41 AM

నామినేషన్‌ వేస్తున్నారా.. ఇవి తప్పనిసరి!

ఏలూరు (టూటౌన్‌): స్థానిక సంస్థల ఎన్నికల్లో (నగరపాలక సంస్థ/మున్సిపాల్టీ/నగర పంచాయతీ) పోటీ చేసే కార్పొరేటర్‌/కౌన్సిలర్‌ అభ్యర్థులు తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను న్యాయ నిపుణులు వివరించారు.

● అభ్యర్థి వ్యక్తిగత పత్రాలు: ఆధార్‌ కార్డు, ఓటర్‌ ఐడీ కార్డు జిరాక్సులు, ఓటరు జాబితాలో అభ్యర్థి పేరు, వార్డు నంబర్‌, పార్ట్‌ నంబర్‌, సీరియల్‌ నంబర్‌, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫోటోలు, వయసు/పుట్టినతేదీ ధృవీకరణ పత్రం–అవసరమైతే చిరునామా/నివాస వివరాల పత్రం, మొబైల్‌ నంబర్‌, బ్యాంక్‌ ఖాతా వివరాలు.

● నామినేషన్‌కు సంబంధించిన పత్రాలు: అధికారిక నామినేషన్‌ ఫారం, అభ్యర్థి సంతకం, ప్రతిపాదకుడు సంతకం, ప్రతిపాదకుడి ఓటర్‌ ఐడీ వివరాలు, ప్రతిపాదకుడి ఓటరు జాబితా సీరియల్‌ నంబర్‌, అవసరమైన డిపాజిట్‌ చెల్లింపు, డిపాజిట్‌ చెల్లించిన రసీదు, అభ్యర్థి అఫిడవిట్‌/ప్రమాణపత్రం, నామినేషన్‌ పత్రంలో అవసరమైన డిక్లరేషన్లు.

● అఫిడవిట్‌ కోసం ముందుగానే సిద్ధం చేసుకోవాల్సిన వివరాలు: అభ్యర్థి పూర్తి పేరు, తండ్రి/భర్త పేరు, వయసు, వృత్తి, ప్రస్తుత చిరునామా, విద్యార్హతలు, అభ్యర్థి పేరుతో ఉన్న స్థిరాస్తుల వివరాలు, చరాస్తుల వివరాలు, బ్యాంకు ఖాతాల వివరాలు, వాహనాల వివరాలు, బంగారం/వెండి వంటి విలువైన ఆస్తుల వివరాలు, అప్పులు/బ్యాంకు రుణాల వివరాలు, ప్రభుత్వానికి బకాయిలు ఉంటే వాటి వివరాలు, అభ్యర్థిపై క్రిమినల్‌ కేసులు ఉంటే వాటి వివరాలు, జీవిత భాగస్వామి ఆస్తులు/అప్పుల వివరాలు (ఫారంలో కోరిన మేరకు), ఆధారపడిన కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు (ఫారంలో కోరిన మేరకు).

● రిజర్వ్‌డ్‌ వార్డు అయితే: కుల ఽధ్రువీకరణ పత్రం, సంబంధిత రిజర్వేషన్‌ కేటగిరీకి చెందినట్టు అవసరమైన ఽధ్రువీకరణ, కుల ధ్రువీకరణ పత్రంలో పేరు/ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించాలి.

● రాజకీయ పార్టీ తరఫున పోటీ చేస్తే: పార్టీ అధికారిక అభ్యర్థిత్వ పత్రాలు, పార్టీ అధీకృత ప్రతినిధి/అధికారిక సంతకం అవసరమైన పత్రాలు, పార్టీ గుర్తుకు సంబంధించిన పత్రాలు, పార్టీ సూచించిన అదనపు డిక్లరేషన్లు, పార్టీ అభ్యర్థి ఫారాలు/అనుబంధాలు (నోటిఫికేషన్‌ ప్రకారం)

● ప్రతిపాదకుడి చెక్‌లిస్ట్‌: ప్రతిపాదకుడు అదే వార్డులో చెల్లుబాటయ్యే ఓటరా అని పరిశీలించాలి. ప్రతిపాదకుడి ఓటరు ఐడీ, ఓటరు జాబితాలో ప్రతిపాదకుడి పేరు, పార్ట్‌ నంబర్‌, సీరియల్‌ నంబర్‌, ప్రతిపాదకుడి సంతకం, నామినేషన్‌ ఫారంలో ప్రతిపాదకుడి వివరాలు సరిగ్గా నమోదు చేయాలి.

● నామినేషన్‌ దాఖలు చేసే రోజు: అన్ని ఒరిజినల్‌ పత్రాలు వెంట తీసుకెళ్లాలి. అన్ని పత్రాలకు అవసరమైన జిరాక్స్‌ కాపీలు సిద్ధం చేసుకోవాలి. నామినేషన్‌ ఫారం పూర్తిగా నింపాలి. పేరు, తండ్రి/భర్త పేరు, వయసు, చిరునామా తప్పుల్లేకుండా ఉండాలి. వార్డు నంబర్‌ సరిగ్గా ఉందో పరిశీలించాలి. ప్రతిపాదకుడి వివరాలు మరోసారి తనిఖీ చేయాలి. అఫిడవిట్‌లో ఖాళీలు లేకుండా చూసుకోవాలి. అవసరమైన చోట సంతకాలు చేయాలి. అవసరమైన చోట ప్రమాణీకరణ/నోటరీ ప్రక్రియ పూర్తి చేయాలి. డిపాజిట్‌ చెల్లించాలి. నామినేషన్‌ను నిర్ణీత సమయం లోపు ఆర్‌ఓ/ఏఆర్‌ఓ వద్ద సమర్పించాలి. నామినేషన్‌ స్వీకరించిన రసీదు/ఎక్‌నాలెడ్జ్‌మెంట్‌ తీసుకోవాలి.

● నామినేషన్‌ సమర్పించిన తర్వాత: నామినేషన్‌ పరిశీలన (స్క్రూటినీ) తేదీ తెలుసుకోవాలి. ఆర్‌ఓ/ఏఆర్‌ఓ ప్రకటించే అభ్యంతరాలు ఉంటే పరిశీలించాలి. నామినేషన్‌ ఆమోదించబడిందా లేదా తె లుసుకోవాలి. ఆమోదం/తిరస్కరణ వివరాలు నమోదు చేసుకోవాలి. ఉపసంహరణ తేదీ తెలుసుకోవాలి. తుది పోటీ అభ్యర్థుల జాబితాలో పేరు ఉందో పరిశీలించాలి. పార్టీ గుర్తు/ఎన్నికల గుర్తు కేటాయింపు వివరాలు నిర్ధారించుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement