టీడీపీకి మూకుమ్మడి రాజీనామాలు చేస్తాం | - | Sakshi
Sakshi News home page

టీడీపీకి మూకుమ్మడి రాజీనామాలు చేస్తాం

Oct 16 2026 7:41 AM | Updated on Oct 16 2026 7:41 AM

టీడీపీకి మూకుమ్మడి రాజీనామాలు చేస్తాం

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు నగరపాలక సంస్థ మేయర్‌ సీటును జనసేనకు కేటాయించడంతో టీడీపీ క్యాడర్‌ ఆగ్రహంతో రగలిపోతున్నారు. గు రువారం రాత్రి స్థానిక టీడీపీ జిల్లా కార్యాలయంలో క్యాడర్‌ అంతా సమావేశమై 62 క్లస్టర్ల ఇన్‌చార్జిలు రాజీనామా చేస్తామని అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేశారు. టీడీపీ మేయర్‌ ఆశావహుడు చల్లా ప్రసాద్‌ మాట్లాడుతూ జనసేన నేత రెడ్డి అప్పలనాయుడు బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏ పార్టీలోనూ నిలకడలేని వ్యక్తి ఆయనని విమర్శించారు. మరో మేయర్‌ సీటు ఆశావహుడు రెడ్డి నాగరాజు మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో రెడ్డి అప్పలనాయుడుకు కేవలం 15 వేల ఓట్లు మాత్రమే వచ్చిన విషయం గమనార్హమన్నారు. రెడ్డి అప్పలనాయుడు ఫ్రెండ్లీ పోటీ చేస్తే మేము చేయలేమా అని ప్రశ్నించారు. మాకు సింబల్‌ ఇవ్వండి, ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుంది అని డిమాండ్‌ చేశారు. మరో నాయకుడు గూడవల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ 2024కు ముందు అప్పలనాయుడు కూటమి ధర్మాన్ని పాటించలేదన్నారు. ఏలూరు మేయర్‌ సీటును జనసేనకు కేటాయించడం టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే చంటికి జరిగిన అవమానంగా క్యాడర్‌ భావిస్తోందన్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే నియోజకవర్గంలో పార్టీకి మూల స్తంభాలుగా ఉన్నవారమంతా రాజీనామా చేస్తామ ని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement