ట్రబుల్‌ మేకర్లపై బైండోవర్‌ కేసులు | - | Sakshi
Sakshi News home page

ట్రబుల్‌ మేకర్లపై బైండోవర్‌ కేసులు

Oct 16 2026 7:41 AM | Updated on Oct 16 2026 7:41 AM

ఏలూరు టౌన్‌: ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికలను పకడ్బందీగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పోలీస్‌ యంత్రాంగం సన్నద్ధమైందని జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్‌ అన్నారు. ఏలూరు డీఎస్పీ కార్యాలయంలో గురు వారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ, పోలింగ్‌ కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణపై మార్గదర్శకాలు జారీ చేశారు. పోలింగ్‌ స్టేషన్ల వారీగా ఆయన సమీక్షించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద రద్దీని నియంత్రించేందుకు, ఓటర్లు లోపలికి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు వేర్వేరు విశాలమైన మార్గాలు ఉండేలా చూడాలని ఎస్పీ సూచించారు. ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించే అసాంఘిక శక్తులు, గతంలో గొడవల్లో పాల్గొన్న వ్యక్తులు, రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని పోలీసులను ఎస్పీ ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ట్రబుల్‌ మేకర్లపై తక్షణమే బైండోవర్‌ కేసులు నమోదు చే యాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్‌ అంతరాయం కలగకుండా చూడాలన్నారు. డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్‌, ఎస్‌బీ సీఐ మల్లేశ్వరరావు, సీఐలు కె.రామకృష్ణ, అశోక్‌ కుమార్‌, కోటేశ్వరరావు, లక్ష్మణరావు, ఎస్సైలు పాల్గొన్నారు.

ఎస్పీ శివకిషోర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement