రబీకి రవాణా గండం | - | Sakshi
Sakshi News home page

రబీకి రవాణా గండం

Apr 15 2026 8:02 AM | Updated on Apr 15 2026 8:02 AM

యథేచ్ఛగా మట్టి తవ్వకాలు

మహిళ అరెస్టు

మంత్రి చెప్పినా ఫలితం శూన్యం

న్యూస్‌రీల్‌

బకాయిలు రూ.33 కోట్ల పైనే..

యథేచ్ఛగా మట్టి తవ్వకాలు
కుక్కునూరు మండలంలో గ్రావెల్‌ తవ్వకాలు యథేచ్చగా సాగుతున్నాయి. పట్ట పగలే దర్జాగా జేసీబీలతో గ్రావెల్‌ని తవ్వి అమ్మకాలు చేపడుతున్నారు. 8లో u

బుధవారం శ్రీ 15 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

సాక్షి ప్రతినిధి, ఏలూరు: రబీలో అన్నదాతకు అగచాట్లు తప్పడం లేదు. ప్రతి సీజన్‌లోను ఏదో ఒక సమస్యతో నష్టపోతూనే ఉన్నాడు. ప్రకృతి విపత్తులు, వరుస తుపానులతో గత ఏడాది నష్టపోతే ఈ ఏడాది సర్కారు నిర్లక్ష్యంతో రబీకి రవాణా ఇబ్బందులు మొదలయ్యాయి. గత ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో ఉమ్మడి పశ్చిమలో రూ.33 కోట్ల రవాణా చార్జీలు బకాయి ఉండటంతో ప్రస్తుత రబీ సీజన్‌లో రవాణా వాహనాలు ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం లేదు. దీంతో కళ్లాల్లోనే కోతలు పూర్తయిన ధాన్యం కుప్పలు పోశారు. ఏలూరు పశ్చిమగోదావరి జిల్లాలో ఇప్పటికే రబీ కొనుగోళ్లు ప్రారంభమై గోనె సంచుల కొరతతో అన్నదాతలు సతమతమవుతున్న తరుణంలో రవాణా గండం మరింత ఇబ్బందికరంగా మారింది.

గత ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో ఏలూరు జిల్లాలో 2.10 లక్షల ఎకరాలు, పశ్చిమగోదావరిలో రూ.2.20 లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌ సాగు చేశారు. అధికారిక అంచనా మేరకు ఖరీఫ్‌లో ఎకరాకు సగటున 26.25 క్వింటాళ్లి దిగుబడి వచ్చింది. ఈ క్రమంలో పశ్చిమలో 5.77 లక్షల మెట్రిక్‌ టన్నులు, ఏలూరు జిల్లాలో 5.50 లక్షల మెట్రిక్‌ టన్నులు దిగుబడి వచ్చింది. పౌరసరఫరాల శాఖ రైతు సేవా కేంద్రాల ద్వారా చివరి గింజ వరకు మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని పదే పదే ప్రకటించింది. విక్రయించిన పంటకు 24 గంటల్లోనే నగదు జమ చేస్తామని పదే పదే ప్రకటించారు. ఉమ్మడి పశ్చిమలో క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. సగటున 5 నుంచి 10 రోజులు చెల్లింపు సమయం పట్టింది. పంట సొమ్ముతో పాటు రవాణా చార్జీలు, హమాలీ చార్జీలు 24 గంటల్లో జమ చేస్తామని ప్రకటించి రైతులను మభ్యపెడుతూ ఖరీఫ్‌ సీజన్‌ దాటించేశారు.

అధికారులకు పట్టని వైనం

వాస్తవానికి గత ఖరీఫ్‌ సీజన్‌లో ప్రకృతి విపత్తులతో పాటు దళారులు, మిల్లర్ల మాయాజాలంతో తక్కువ ధరకు పంటను విక్రయించి ఉమ్మడి జిల్లాలో సుమారు రూ.70 కోట్ల పైచిలుకు మద్దతు ధర కంటే తక్కువ పొందిన పరిస్థితి. ఈ ఏడాది కూడా రబీ సీజన్‌ ప్రారంభంలోనే కష్టాలు మొదలైనా సంబంధిత అధికారులు మొదలుకుని, జిల్లా ఉన్నతాధికారుల వరకు ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. ఏలూరు జిల్లాలో లక్ష, పశ్చిమలో 2.25లక్షల ఎకరాల్లో సాగు జరగగా, ఏలూరు జిల్లాలో 2.75 లక్షల మెట్రిక్‌ టన్నులు, పశ్చిమలో 6.5 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అంచనాతో ఉన్నారు. కొనుగోలు చేయడానికి వీలుగా ఏలూరులో 123, పశ్చిమలో 255 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే రవాణా బకాయిలతో గ్రామాల్లో గందరగోళం నెలకొంది.

ఏలూరు ఆర్‌టీసీ బస్టాండ్‌లో చోరీలకు పాల్పడుతున్న మహిళను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆమె నుంచి 14 కాసుల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. 8లో u

ఉమ్మడి పశ్చిమలో ఖరీఫ్‌ సీజన్‌ పూర్తయ్యి రబీ సీజన్‌ తుది దశకు చేరింది. అనేక మండలాల్లో గత వారం నుంచి రబీ సాగు కోతలు ముమ్మరంగా సాగుతున్నప్పటికీ గత ఖరీఫ్‌ సీజన్‌ రవాణా చార్జీలు నేటికీ జమ చేయని పరిస్థితి. కొద్ది రోజుల క్రితం ఏలూరు జిల్లాలో జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశంలో ఇన్‌చార్జి మంత్రి మాట్లాడుతూ.. రవాణా చార్జీలు ప్రాసెస్‌లో ఉన్నాయని, రెండు రోజుల్లో చెల్లిస్తామని అధికారికంగా ప్రకటించారు. సమావేశం ముగిసి వారాలు గడిచినా నేటికీ ఒక్క రూపాయి కూడా జమ కాకపోవడంతో లారీ, ట్రాక్టర్‌ యజమానులు బిల్లులు బకాయిలు ఉండటంతో రబీ సీజన్‌కు వాహనాలు సమకూర్చడానికి ముందుకు రావడం లేదు. ఇప్పటికే ఏలూరు పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 10 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి. అనేక చోట్ల రవాణా సౌకర్యం లేక, గోనె సంచులు అందుబాటులో లేకపోవడంతో కళ్ళాల్లోనే ధాన్యం నిల్వలకు పట్టాలు కప్పి కాపలా కాయాల్సిన పరిస్థితి నెలకొంది.

పశ్చిమగోదావరి జిల్లాలో గత ఖరీఫ్‌ సీజన్లో 65,400 మంది రైతుల నుంచి రూ.1052 కోట్లు విలువైన 4.44లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. వీటికి సంబంధించి రూ.16 కోట్ల రవాణా చార్జీల బకాయి ఉంది. ఏలూరు జిల్లాలో సుమారు 4 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, రూ.17 కోట్ల మేర రవాణా చార్జీలు పెండింగ్‌లో పెట్టారు. రెండు జిల్లాలో కలిపి సుమారు 1500కు పైగా లారీలకు బకాయిలు చెల్లించాల్సి ఉండటంతో రబీ సీజన్‌లో వాహనాలు పెట్టడానికి యజమానులు ముందుకు రావడం లేదు. రెండు రోజుల క్రితం భీమడోలు మండలం పూళ్ళ గ్రామంలో రవాణా వసతి లేక 100 లారీల ధాన్యం కళ్ళాల్లో నిల్వ ఉందని, రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని అన్నదాతలు ఆందోళన నిర్వహించారు.

గత ఖరీఫ్‌లో ఉమ్మడి పశ్చిమలో రూ.33 కోట్ల బకాయిలు

బకాయిల నేపథ్యంలో ముందుకు రాని లారీ యజమానులు

రబీ కొనుగోళ్ల నేపథ్యంలో రవాణాకు అడ్డంకులు

ఆరు నెలలుగా బకాయిలు చెల్లించని ప్రభుత్వం

Advertisement
 
Advertisement
Advertisement