అంబేడ్కర్‌ జీవితం ఆదర్శనీయం | - | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌ జీవితం ఆదర్శనీయం

Apr 15 2026 8:02 AM | Updated on Apr 15 2026 8:02 AM

అంబేడ్కర్‌కు నివాళులర్పిస్తున్న కలెక్టర్‌ వెట్రిసెల్వి

అంబేడ్కర్‌కు నివాళి అర్పిస్తున్న ఎస్పీ శివకిషోర్‌

ఏలూరు (టూటౌన్‌): ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారతదేశానికి దిక్సూచి వంటి భారత రాజ్యాంగాన్ని రచించిన డా. బీఆర్‌ అంబేడ్కర్‌ ప్రపంచ మేధావి అని కలెక్టర్‌ కె. వెట్రిసెల్వి అన్నారు. డా.బీఆర్‌ అంబేడ్కర్‌ 135వ జయంతి ఉత్సవాల సందర్భంగా స్థానిక కలెక్టరేట్లో మంగళవారం అంబేడ్కర్‌ చిత్రపటానికి కలెక్టర్‌ వెట్రిసెల్వి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ సమాజంలో అంటరానితనం, కుల వివక్షలపై అంబేడ్కర్‌ రాజీలేని పోరాటం చేశారని, ఆయన జీవితం ఆదర్శనీయమని అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ విశ్వమోహన్‌ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, వివిధ షెడ్యూల్డ్‌ కులాల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

గొప్ప దార్శనికుడు అంబేడ్కర్‌

ఏలూరు టౌన్‌: అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సమానత్వం, రాజ్యాంగ హక్కులు కల్పించిన గొప్ప దార్శనికుడు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అని ఎస్పీ కొమ్మి ప్రతాప్‌ శివకిషోర్‌ కొనియాడారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి వేడుకలను మంగళవారం ఏలూరు జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఏఆర్‌ అదనపు ఎస్పీ జీ.మునిరాజా, ఏఆర్‌ డీఎస్పీ చంద్రశేఖర్‌, ఎస్‌బీ సీఐ మల్లేశ్వరరావు తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement