108 భాషల్లో భగవద్గీత శ్లోకాలు | - | Sakshi
Sakshi News home page

108 భాషల్లో భగవద్గీత శ్లోకాలు

Apr 15 2026 8:02 AM | Updated on Apr 15 2026 8:02 AM

108 భాషల్లో భగవద్గీత శ్లోకాలు

గజల్‌ మాస్ట్రో గజల్‌ శ్రీనివాస్‌

భీమవరం(ప్రకాశంచౌక్‌): భగవద్గీత అనేది ఆధ్యాత్మికతతో పాటు ప్రతి ఒక్కరి జీవన విధానానికి మార్గనిర్ధేశం చేసే గొప్ప గ్రంథమని గజల్‌ మాస్ట్రో గజల్‌ శ్రీనివాస్‌ అన్నారు. భీమవరం హోసింగ్‌ బోర్డు కాలనీలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి 15వ వార్షిక కల్యాణ బ్రహ్మోత్సవంలో ఆయన పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయన్ను ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఈ సందర్భంగా గజల్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రతి రోజు కొన్ని నిమిషాలు గీతా పఠనం చేయడం ద్వారా మనస్సు స్థిరంగా మారుతుందని, శాంతి, ధైర్యం, సమతుల్యత పెరుగుతాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాలకు 108 భాషల్లో భగవద్గీత శ్లోకాలను అందింస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సుదర్శన సహిత లక్ష్మీ నరసింహ హోమం నిర్వహించారు. మందిర అధ్యక్షుడు కంతేటి వెంకటరాజు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement