మద్దిలో పూజలు | - | Sakshi
Sakshi News home page

మద్దిలో పూజలు

Apr 15 2026 8:02 AM | Updated on Apr 15 2026 8:02 AM

మద్దిలో పూజలు

జంగారెడ్డిగూడెం: మండలంలోని గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారికి ఆలయ ముఖ మండపం వద్ద తమలపాకులతో అష్టోత్తర పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామి వారిని విశేషంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయానికి వివిధ సేవల ద్వారా రూ. 2,92,565 ఆదాయం వచ్చినట్లు ఈవో ఆర్‌వీ చందన తెలిపారు. అన్నదాన సత్రంలో 2,490 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement