నూజివీడు: నాటు సారా తయారుచేసి విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎకై ్సజ్ శాఖ జిల్లా సూపరింటెండెంట్ ఎ. ఆవులయ్య హెచ్చరించారు. మంగళవారం నూజివీడులోని ఎకై ్సజ్ స్టేషన్ ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ లో రికార్డులను పరిశీలించి, సిబ్బందితో సమావేశమయ్యారు. చట్ట విరుద్ధంగా సారా తయారీ, విక్రయాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సారా నివారణ కోసంఅవగాహన కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సూచించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూసారాను నివారించడం వలన నూజివీడు నియోజకవర్గంలో లో నెలలో రూ.5 కోట్ల లిక్కర్ వ్యాపారం పెరిగిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎకై ్సజ్ సీఐ ఎ.మస్తానయ్య, సిబ్బంది పాల్గొన్నారు.


