ద్వారకాతిరుమల: మండలంలోని వేంపాడు గ్రామ బీసీ కాలనీలోని అంగన్‌వాడీ కేంద్రానికి మంగళవారం కోడి గుడ్లు సరఫరా అయ్యాయి. ఈ పాఠశాలకు సరఫరా చేయాల్సిన కోడి గుడ్లును గత మంగళవారం వ్యాన్ డ్రైవర్ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయన్న కారణంగా, అదే గ్రామంలోని సరిహద్దు సుజాత ఇంట్లో వాటిని పెట్టాడు. వారం గడిచినా వాటిని అంగన్‌వాడీ టీచర్ పట్టుకెళ్లలేదు. దాంతో అవి సుజాత ఇంట్లోనే మూలనపడి ఉన్నాయి. దీనిపై పలు పత్రికల్లో మంగళవారం కథనాలు ప్రచురితమయ్యాయి. వాటికి స్పందించిన జంగారెడ్డిగూడెం ఐసీడీఎస్ సీడీపీఓ బ్యూలా, సెక్టార్ సూపర్‌వైజర్ మేరి వెంటనే గుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్‌తో మాట్లాడారు. సకాలంలో, సక్రమంగా గుడ్లు సరఫరా చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. అలాగే గుడ్లు స్టాక్ సమయానికి అందుబాటులో లేకపోతే వెంటనే సెక్టార్ సూపర్‌వైజర్‌కు తెలపాలని అంగన్‌వాడీ కార్యకర్తలకు సూచించారు.


