అదరగొట్టిన ఆంధ్రా జట్టు
ఏలూరు రూరల్: అంధుల క్రికెట్ పోటీలో ఆంధ్ర జట్టు విజయం సాదించింది. తెలంగాణ జట్టుపై 2 వికెట్ల తేడాతో గెలిచింది. బుధవారం ఏలూరు ఆశ్రం వైద్య కళాశాల ఆవరణలో అంధుల టి20 క్రికెట్ పోటీ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆంధ్ర జట్టు నిర్ణీత ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. బ్యాట్స్‌మెన్ ఏ రవి 118 పరుగులతో సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. తర్వాత లక్ష్య చేధనకు దిగిన తెలంగాణ జట్టు 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. హతిక్ 75 పరుగులతో రాణించినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. మూడు మ్యాచ్‌ల సీరిస్‌లో భాగంగా ఆశ్రంలో మొదట మ్యాచ్ జరిగింది. పోటీల ప్రారంబోత్సవంలో ఆశ్రం సీఈఓ డాక్టర్ కె హనుమంతురావుతో పాటు సంగీత్ దర్శకుడు సందీప్‌రాజ్ క్రీడాకారులను అభినందించారు. అంధులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ అధ్యక్షుడు శరత్‌బాబు. పోటీలకు సహకరించిన ఆశ్రం యాజమాన్యానికి నిర్వాహకులు కె మధన్, జయరాజు ధన్యవాదాలు తెలిపారు.
అంధుల క్రికెట్‌లో పైచేయి
అదరగొట్టిన ఆంధ్రా జట్టు


