విద్యార్థులకు ఉచిత బస్‌ పాస్‌లు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు ఉచిత బస్‌ పాస్‌లు

Jun 16 2025 5:45 AM | Updated on Jun 16 2025 5:45 AM

విద్య

విద్యార్థులకు ఉచిత బస్‌ పాస్‌లు

భీమవరం(ప్రకాశం చౌక్‌): స్కూలు, కళాశాలకు విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు ఆర్టీసీ ఏటా ఉచితంగా బస్సు పాసులిస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేలా ఈ పాసులు మంజూరు చేస్తోంది. 12 ఏళ్ల లోపు బాలురు, 18 ఏళ్ల లోపు బాలికలకు వీటిని ఇస్తారు. విద్యా సంవత్సరం మొదలు కావడంతో ఈ నెల 13 నుంచి ఉచిత బస్‌పాస్‌లు పశ్చిమ ఆర్టీసీ జారీ చేస్తోంది. భీమవరం, తణుకు, నర్సాపురం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు ఆర్టీసీ బస్టాండ్‌ల్లో పాస్‌ల జారీ చేయడానికి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఉచిత బస్‌పాస్‌లతో పాటు రాయితీ, దివ్యాంగుల(పీహెచ్‌) పాస్‌లు కూడా జారీ చేస్తున్నారు. విద్యార్థులు విద్యార్థి ఫొటో, స్కూల్‌ యాజమాన్యం నుంచి (బోనఫైడ్‌ సర్టిఫికెట్‌) ధ్రువీకరణ పత్రం సమర్పించి బస్‌పాస్‌ పొందవచ్చును. ఆర్టీసీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుని కౌంటర్‌ దగ్గరకు వెళ్తే వెంటనే ఉచిత పాస్‌ పొందవచ్చు. పాస్‌ పొందిన విద్యార్థులు తమ ఇంటి నుంచి 20 కిలోమీటర్ల దూరం వరకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చు. 2024–25 ఏడాదికి జిల్లాలో నాలుగు డిపోల పరిధిలో మొత్తం 13,190 ఉచిత బస్‌ పాస్‌లు అందిస్తున్నారు.

రాయితీ పాస్‌లు ఇలా

రాయితీ బస్‌ పాస్‌ పొందేవారికి పాస్‌ ధరతో నెలవారీ గుర్తింపు కార్డు రూ.50, సర్వీస్‌ చార్జీ రూ.40 అదనంగా చెల్లించాలి. రాయితీతోపాటు సంవత్సరం గుర్తింపు కార్డు కోసం రూ.100 చెల్లించాలి. పాస్‌లు నెల, మూడు నెలలు, ఏడాది కాలపరిమితితో మంజూరు చేస్తారు. గడువు ముగిశాక రెన్యువల్‌ కోసం ప్రిన్సిపాల్‌ సంతకం చేయించుకుని తిరిగి పొందాలి. సాధారణ విద్యార్థులకు జూన్‌ నుంచి ఏప్రిల్‌ వరకూ, ఐటీఐ, పారా మెడికల్‌ వంటి కోర్సులు చదివే వారికి మే నెల వరకు పాసులు మంజూరుచేస్తారు.

దివ్యాంగులకు ఉచిత పాసులు

ఆర్టీసీ దివ్యాంగులకు ఉచిత పాసులు అందిస్తుంది. పాస్‌ పొందడానికి సర్టిఫికెట్‌, ఆధార్‌ కార్డు, అన్‌ ఎంప్లాయిమెంట్‌ సర్టిఫికెట్‌ సమర్పించాలి. మూడేళ్ల కాల వ్యవధితో ఈ పాస్‌లు జారీ చేస్తారు.

అన్ని బస్టాండ్లలో ప్రత్యేక కౌంటర్లు

కళాశాలలు, స్కూళ్లు ప్రారంభమైన నేపథ్యంలో కొత్త బస్‌ పాస్‌ల జారీకి చర్యలు తీసుకున్నాం. ఈనెల 13 నుంచి పాస్‌లు మంజూరు చేస్తున్నాం. కొత్తవి మంజూరు, పాత పాస్‌లు రెన్యువల్‌ చేసి విద్యార్థులకు వేగంగా అందించడానికి జిల్లాలోని ఐదు బస్టాండ్‌ల్లో కౌంటర్లు ఏర్పాటు చేశాం. రద్ధీ బట్టి అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తాం.

ఎన్‌వీఆర్‌ వరప్రసాదరావు జిల్లా ప్రజా రవాణా అధికారి

ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసిన ఆర్టీసీ

12 ఏళ్లలోపు బాలురు, 18 ఏళ్ల బాలికలకు ఉచిత పాసులు

2024–2025 ఏడాది జిల్లాలో 1390 ఉచిత పాసుల జారీ

గత రెండేళ్లుగా బస్‌ పాస్‌ల జారీ ఇలా..

ఏడాది డిపో ఉచిత పాస్‌లు రాయితీ పాస్‌లు పీహెచ్‌సీ పాస్‌లు

2023–24 భీమవరం 6,056 10,966 319

నర్సాపురం 2,239 6,367 513

తణుకు 1,266 4,705 347

తాడేపల్లిగూడెం 2,142 6,122 506

2024–25 భీమవరం 5,010 4,924 410

నర్సాపురం 2,512 4,518 358

తణుకు 2,108 3,661 363

తాడేపల్లిగూడెం 3,560 3,839 376

విద్యార్థులకు ఉచిత బస్‌ పాస్‌లు 1
1/1

విద్యార్థులకు ఉచిత బస్‌ పాస్‌లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement