చిన్నతిరుపతి క్షేత్రంలో పోటెత్తిన భక్తులు | - | Sakshi
Sakshi News home page

చిన్నతిరుపతి క్షేత్రంలో పోటెత్తిన భక్తులు

Jun 16 2025 5:45 AM | Updated on Jun 16 2025 5:45 AM

చిన్నతిరుపతి క్షేత్రంలో పోటెత్తిన భక్తులు

చిన్నతిరుపతి క్షేత్రంలో పోటెత్తిన భక్తులు

ద్వారకాతిరుమల: చిన్నతిరుపతి క్షేత్రంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ఈనెల 11తో ముగిశాయి. అయితే మంచి తిధులు లేకపోవడంతో విద్యార్థులను తమ తల్లిదండ్రులు సోమవారం నుంచి పాఠశాలలకు పంపేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆఖరి సెలవురోజును పురస్కరించుకుని పెద్ద ఎత్తున భక్తులు క్షేత్రానికి తరలివచ్చారు. దాంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, దర్శనం క్యూలైన్లు, కల్యాణకట్ట ఇతర విభాగాలు భక్తులతో కిక్కిరిసాయి. సాయంత్రం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. ఆలయ అనివేటి మండపంలో పలు భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement