సౌత్‌ సెంట్రల్‌ క్రికెట్‌ పోటీల పోస్టర్‌ విడుదల

- - Sakshi

● గడపగడపకు సంక్షేమం

దెందులూరు: జేఎన్‌టీయూ సౌత్‌ సెంట్రల్‌ క్రికెట్‌ పోటీల పోస్టర్‌ను ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి మంగళవారం దెందులూరులోని తన కార్యాలయంలో ప్రారంభించారు. వేగవరం హేలాపురి ఇంజినీరింగ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఏఓ టీ.కరుణానిధి, మేనేజింగ్‌ ట్రస్టీ సమీర్‌, ప్రిన్సిపల్‌ రాధాకృష్ణ, ప్రొఫెసర్‌ శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్‌ కోటే నాగమల్లేశ్వరి కుమార్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 25 నుంచి పోటీలు ప్రారంభమవుతాయని ఏఓ కరుణానిధి తెలిపారు. ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల నుంచి 70 ఇంజనీరింగ్‌ కళాశాల నుంచి విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటారని వివరించారు.

Read latest Eluru News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top