రాష్ట్రంలో లోకేష్‌ రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో లోకేష్‌ రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు

Jun 23 2026 12:18 AM | Updated on Jun 23 2026 12:18 AM

సాక్షి, రాజమహేంద్రవరం: గోదావరి పుష్కరాలు ఎంతో ప్రతిష్టాత్మకం. అలాంటి వేడుకలు 2027 జూన్‌ 27వ తేదీ నుంచి 12 రోజుల పాటు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 10 కోట్ల మంది యాత్రికులు వస్తారని అంచనా. భక్తుల వసతుల కల్పనకు ఆరు జిల్లాల పరిధిలో రూ.8,500 కోట్ల నిధులతో 7 వేల పనులు చేపట్టాలని అధికారులు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు. నేటికీ నయాపైసా విడుదల కాకపోయినా.. నిధులు విడుదలపై గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైతే.. రానున్న సెప్టెంబర్‌ నుంచి పనులు ప్రారంభమవుతాయి. దీంతో గోదావరి పరివాహక ప్రాంత ఎమ్మెల్యేలంతా ఇప్పుడు పుష్కరాల బడ్జెట్‌ను టార్గెట్‌ చేశారు. ఈ పనులను దక్కించుకుని నిధులు కొల్లగొట్టేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుష్కర పనులు దక్కాలంటే.. తమకు అనుకూలమైన అధికారులు ఉండాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే తమ అడుగులకు మడుగులొత్తే అధికారుల కోసం వెతుకుతున్నారు. తమకు అనుకూలంగా ఉండే అధికారులకు పోస్టింగ్‌ ఇప్పించుకునేందుకు పైరవీలు చేస్తున్నారు.

వీళ్లతో కాదులే..?

తమకు అనుకూలమైన అధికారులకు పోస్టింగ్‌ తెప్పించుకునేందుకు ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులను అవమానాలకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న అధికారులతో పుష్కర పనులు చేయడం సాధ్యం కాదని చెబుతున్నారని తెలిసింది. ఇందులో భాగంగానే అధికారులు చేపడుతున్న పనులను తప్పుబడుతున్నారు. వారు తయారు చేసిన ప్రతిపాదనలకు వంకలు పెడుతున్నట్లు సమాచారం. ఏదో విధంగా తమకు నచ్చని వారిని సాగనంపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఓ జిల్లా స్థాయి అధికారి, మరో కార్పొరేషన్‌లో ఓ ఉన్నతాధికారిని బదిలీ చేయాలని పట్టుబడుతున్నట్లు తెలిసింది. వారి స్థానంలో తాము ప్రతిపాదించిన వారిని నియమించాలని కోరినట్లు సమాచారం.

కాంట్రాక్ట్‌ కొట్టేసేందుకు పావులు

పుష్కర పనుల కాంట్రాక్ట్‌ దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే వ్యహాలు రచిస్తున్నారు. దీనికోసం మరో అడుగు ముందుకేసి అవసరమైతే తామే స్వయంగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. పుష్కరాల పనుల్లో ఎంత వీలైతే అంత ఆర్జించాలని భావిస్తున్నట్లు తెలిసింది. రూపాయి ఖర్చు చేసి రూ.వంద సంపాదించుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు. ఇందుకు కాంట్రాక్టుల కోసం బినామీ కంపెనీలను ఏర్పాటు చేసుకుంటున్నట్లు సమాచారం. ఏం చేసినా ఈ ఏడాదిలోనే సంపాదించాలనే ఆశతో ఉన్నారు. పుష్కర బడ్జెట్లో ఎవరు ఎక్కువ నిధులు తెచ్చుకుంటే, అంత ఎక్కువ దండుకోవచ్చన్న అభిప్రాయంతో ఎమ్మెల్యేలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. అత్యధిక నిధులు తమకే కేటాయించాలని, జనసేన ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నట్లు తెలిసింది. ఈ విషయంలో జనసేన ఎమ్మెల్యేలు అందరూ కలసికట్టుగా ఉంటే.. టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పుష్కర పనుల్లో ఏ పనైనా.. 20 శాతం వాటా మిగులుతుందని గత అనుభవాల ప్రకారం ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో కొత్తగా మోడల్‌ స్నాన ఘట్టాలు నిర్మించాలని ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు తెలిసింది. భక్తులకు అసౌకర్యం కలగకుండా చైన్నె క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థతో కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు తయారు చేసింది. అందులో భాగంగా సీతానగరం మండలం మునికూడలి గ్రామంలో మోడరన్‌ స్నానఘట్టం నిర్మాణం, కొవ్వూరు మండలం పెద్ద వాడపల్లి గ్రామం వద్ద రెండు కిలోమీటర్ల మేరకు స్నానఘట్టం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

రాజమహేంద్రవరం పుష్కరాల రేవులో అభివృద్ధి పనులు

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): రాష్ట్రంలో మంత్రి లోకేష్‌ రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతుందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తుంగలోకి తొక్కిందని వైఎస్సార్‌ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ ధ్వజమెత్తారు. ప్రభుత్వ అన్యాయాలు, స్థానిక ప్రజాప్రతినిధుల అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం స్థానిక జిల్లా కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌లో వైఎస్సార్‌ సీపీ శ్రేణులతో కలసి భరత్‌రామ్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నగరంలో కల్తీ పాల ఘటనలో బాధితులకు మెరుగైన చికిత్స అందక మృత్యుఒడిలోకి చేరుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటన జరిగినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా ప్రభుత్వ పెద్దలు కలసి బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామని ప్రకటించారని, ఈ రోజు వరకూ సరైన వైద్యం అందించిన దాఖలాలు వేవనన్నారు. బాధిత బాలల కుటుంబాలకు ఇప్పటివరకూ రూ.మూడున్నర లక్షలు ఖర్చయ్యిందని, ప్రభుత్వం ఆ సొమ్ము ఇవ్వలేదన్నారు. వైఎస్సార్‌ సీపీలో క్రియాశీలకంగా ఉండే బీసీ నాయకుడు పీతా రామకృష్ణపై అక్రమంగా పీడీ చట్టం ప్రయోగించారని భరత్‌రామ్‌ మండిపడ్డారు. ఇదంతా ఈవీఎం ఎమ్మెల్యే కుట్రలో భాగమేనని, అతని ఒత్తిడి మేరకు పోలీసులు నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాజమహేంద్రవరం నగర టీడీపీలో 40వ వార్డు పరిసరాల్లో రెండు గ్రూపులు కొట్టుకున్నాయని, కొట్టిన వారు పెట్టిన కేసును పోలీసులు నమోదు చేశారని, దెబ్బలు తిన్న వారిని అరెస్టు చేశారన్నారు. ఇదేమి అన్యాయమని అడిగిన పీతా రామకృష్ణపై పీడీ యాక్ట్‌ అమలు చేయడం దారుణమన్నారు. బోట్‌మెన్‌ సొసైటీల పేరుతో గామన్‌ బ్రిడ్జి వద్ద రాత్రి పగలు తేడా లేకుండా డ్రెజ్జింగ్‌ బోట్లతో ఈవీఎం ఎమ్మెల్యే అనుచరులు ఇసుక దోపిడీ చేస్తున్నారన్నారు. గామన్‌ బ్రిడ్జి ప్రమాదంలో పడుతోందని, స్థానిక మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నారని అన్నారు. ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకూ ఇసుక దోపిడీ జరుగుతోందని, సామాన్యులకు మాత్రం ఇసుక దొరకడం లేదని విమర్శించారు. ఇసుక దోపిడీకి సంబంధించి సాక్ష్యాధారాలను జిల్లా కలెక్టర్‌కు అందజేశామని చెప్పారు. ఈవీఎం ఎమ్మెల్యే ముస్లింలకు వ్యతిరేకమని, తన హయాంలో వీరభద్రనగరం వద్ద పాత కబేలా స్థలంలో ముస్లింలకు 2,500 చదరపు గజాలు (50 సెంట్లు) షాదీ ఖానాకు కేటాయించానని, దానికి రూ.50 లక్షలు కూడా కేటాయించినట్లు తెలిపారు. ఈ స్థలాన్ని ప్రస్తుతం ఈవీఎం ఎమ్మెల్యే ముస్లింలకు కేటాయించలేదని, పనులు కూడా ప్రారంభించలేదని, దీనిపై ప్రస్తుత ఎంపీ ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. షాదీఖానా నిర్మాణం జరిగేంత వరకూ పోరాడతానని స్పష్టం చేశారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు, మహిళలు కార్యకర్తలు ఉన్నారు.

నిధుల ప్రతిపాదనలు ఇలా..

గోదావరి పుష్కరాల్లో భాగంగా ఆరు జిల్లాల పరిధిలోని 242 గ్రామాల్లో గోదావరి పుష్కరాల పనులు చేపట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పంచాయతీరాజ్‌ శాఖ నుంచి రూ.100 కోట్లు కేటాయిస్తామని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ప్రకటించారు. ప్రస్తుతం అఖండ గోదావరి ప్రాజెక్టు కింద టూరిజం శాఖకు చెందిన రూ.94 కోట్లతో రాజమహేంద్రవరంలో రివర్‌ ఫ్రంట్‌, పుష్కర్‌ ఘాట్‌ ఆధునికీకరణ, హేవలాక్‌ బ్రిడ్జి పాదచారుల వంతెనగా పనులు చేస్తున్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పనులపై టీడీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. తమ ప్రమేయం లేకుండా నాసిరకంగా పనులు చేస్తున్నారని ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. మరోవైపు పుష్కర పనుల్లో భాగంగా అండర్‌ గ్రౌండ్‌ విద్యుత్‌ లైన్ల ఏర్పాటుకు రూ.240 కోట్లతో ప్రతిపాదించిన పనులకు శంకుస్థాపన చేశారు. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయాల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గోదావరి జలాల కాలుష్య నివారణకు రూ.100 కోట్లు వెచ్చించాలని భావిస్తున్నారు. కేంద్రం సైతం రూ.100 కోట్లు కేటాయించింది. అయితే ఎమ్మెల్యేలు, అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో ప్రస్తుతం పుష్కర పనులపై గందరగోళం నెలకొంది. అందుకే ఎమ్మెల్యేలు అధికారులను బదిలీ చేసి... తమకు అనుకూలమైన వారిని తెచ్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలిసింది.

గోదావరి పుష్కరాల నిధులు కొల్లగొట్టేందుకు ఎమ్మెల్యేలు వ్యూహాలు రచిస్తున్నారా..? అభివృద్ధి పనుల టెండర్లు దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేస్తున్నారా..? ఇందుకు తమకు అనుకూలమైన అధికారులను తెచ్చుకునేందుకు పావులు కదుపుతున్నారా..? నిక్కచ్ఛిగా ఉన్న అధికారులను సాగనంపేందుకు కుట్రలు పన్నుతున్నారా..? ఆ దిశగా పైరవీలకు దిగుతున్నారా..? అందులో భాగంగా పుష్కరాలకు రూ.8,500 కోట్ల నిధులు అవసరమని ప్రతిపాదనలు పంపారా..? అంటే అవుననే రాజకీయ విశ్లేషకుల సమాధానం వస్తోంది.

ఫ పుష్కర నిధులు

కొల్లగొట్టేందుకు వ్యూహాలు

ఫ పైరవీలకు ప్రజాప్రతినిధుల కసరత్తు

ఫ అనుకూల అధికారులను

తెచ్చుకునేందుకు పావులు

ఫ కల్తీ పాల ఘటనలో బాధితులకు

అందని మెరుగైన వైద్యం

ఫ మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ ధ్వజం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement