గోదావరిలో యువకుడి గల్లంతు | - | Sakshi
Sakshi News home page

గోదావరిలో యువకుడి గల్లంతు

Jun 23 2026 12:18 AM | Updated on Jun 23 2026 12:18 AM

సీతానగరం: మండలంలోని బొబ్బిల్లంకకు చెందిన కట్టుబోయిన అజయ్‌ (15) ప్రమాదవశాత్తూ పడవ నుంచి పడి గోదావరిలో గల్లంతయ్యాడు. సోమవారం ఉదయం గోదావరి మధ్యలోని ములకల్లంక పశు వుల పాకకు వెళ్లాడు. ఉదయం 11 గంటలకు తిరి గి బొబ్బిల్లంకకు రావడానికి గోదావరి ఒడ్డుకు చేరుకున్నాడు. స్థానికులు ప్రయాణం చేసే మరపడవలపై కాకుండా కూలీల పడవపై మరో ఇద్దరి తో అజయ్‌ ఎక్కాడు. పడవ తెడ్డు వేస్తుండగా గోదావరి మధ్యలోకి చేరుకున్న తరువాత అదుపుతప్పి గోదావరిలో జారిపడి గల్లంతయ్యాడు. మృతదేహం కోసం స్థానికులు పడవలపై గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.

గోదావరిలో దూకి ఆత్మహత్య

మండలంలోని ఇనుగంటివారిపేటకు చెందిన కుప్పాల పెదకాపు (43) ఆరోగ్య పరిస్థితి బాగాలేక సోమవారం ఉదయం గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుగర్‌ వ్యాధితో బాధపడుతున్న పెదకాపు కాలి వేళ్లు తీసివేయాలని వైద్యులు చెప్పడంతో మనస్థాపం చెంది ఉదయం 6 గంటలకు కాలకృత్యాలు తీర్చుకోవడానికి అని చెప్పి వెళ్లి గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం 11 గంటలకు మృతదేహం లభ్యమవగా దహన సంస్కారాలు నిర్వహించారు. ఎటువంటి సమాచారం లేదని స్థానిక పోలీసులు తెలిపారు.

తల్లిని చంపిన కేసులో

నిందితుడి అరెస్ట్‌

పిఠాపురం: అడిగిన వెంటనే మంచినీళ్లు ఇవ్వలేదన్న కోపంతో కన్న తల్లిపై దాడి చేసి ఆమె మరణానికి కారణమైన కేసులో నిందితుడిని సోమవా రం అరెస్టు చేసినట్లు పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం పిఠాపురం మండలం చిత్రాడకు చెందిన పెంటా రాజబాబు తన ఇంట్లో భోజనం చేస్తూ తల్లిని మంచినీరు ఇవ్వాలని అడిగాడు. తల్లి మంచినీరు ఇవ్వడానికి ఆలస్యం చేసిందన్న కోపంతో తన తల్లి నాగమణి ని తలను బల్లకేసి గట్టిగా అదిమి కొట్టాడు. దీంతో తలకు తీవ్రగాయాలైన ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. నిందితుడు రాజబాబుపై హత్య కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచినట్లు ఆయన తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement