అంతర్జాతీయ జర్నల్‌లో కాకినాడ వైద్యుడి పరిశోధన | - | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ జర్నల్‌లో కాకినాడ వైద్యుడి పరిశోధన

Jun 23 2026 12:18 AM | Updated on Jun 23 2026 12:18 AM

కాకినాడ క్రైం: కోవిడ్‌ వేళ వ్యాధి నివారణకు తాను చేసిన మూడు మాత్రల పరిఽశోధన అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురితమైందని కాకినాడ వైద్యుడు యనమదల మురళీకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జర్నల్‌ ఆఫ్‌ ప్రైమరీ కేర్‌ స్పెషాలిటీస్‌ మే–ఆగస్టు 2026 సంచికలో తాను ప్రయోగాత్మకంగా రూపొందించిన ఆస్ప్రిన్‌, ప్రెడ్నిసోలాన్‌, అజిత్రోమైసిన్‌ వైద్య విధానం ఎంతో సత్ఫలితాలనిచ్చిందని పేర్కొన్నారు. 2021లో అప్పటి వైద్య రీతులను అనుసరించిన 60 మందితో తన వైద్య విధానాన్ని సరిపోల్చితే ఉత్తమ ఫలితాలు వచ్చాయన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన నిపుణులు తన పరిశోధనను అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురించారని మురళీకృష్ణ ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement