25 నుంచి సర్టిఫికెట్లు పరిశీలన
రాజమహేంద్రవరం రూరల్: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 24వ తేదీ నుంచి కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైందని జిల్లా పాలిసెట్ కన్వీనర్, బొమ్మూరు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ అక్కుల మురళి తెలిపారు. ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్ సర్టిఫికెట్ల పరిశీలన, ఫీజు పేమెంట్, రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుందన్నారు. ఈ నెల 25 నుంచి జూలై ఒకటో తేదీ వరకు విద్యార్థుల సర్టిఫికెట్లు పరిశీలిస్తామన్నారు. ఇందుకోసం బొమ్మూరులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలల్లో అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు. షెడ్యూల్‌లో ప్రకటించిన ప్రకారం ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 5 గంటల వరకు నిర్వహించే ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు విద్యార్థులు వారి ర్యాంకుల ప్రకారం హాజరుకావాలని సూచించారు.
విద్యార్థులకు సూచనలివీ...
● విద్యార్థులు ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి వస్తుంది. ఓసీ, బీసీలకు రూ.700, ఎస్సీ, ఎస్టీలకు రూ.250గా నిర్ణయించారు.
● ప్రాసెసింగ్ ఫీజు రసీదుతో పాటు, పాలిసెట్ హాల్ టికెట్, ర్యాంకు కార్డు, ఎస్‌ఎస్‌సీ హాల్ టికెట్, ర్యాంకు కార్డు, ఎస్‌ఎస్‌సీ మార్కుల మెమో ఒరిజినల్ లేదా ఇంటర్నెట్ కాపీని కౌన్సెలింగ్‌కు తీసుకురావాలి.
● 4–10 తరగతుల స్టడీ సర్టిఫికెట్ లేదా రెసిడెన్షియల్ సర్టిఫికెట్, ఆదాయ ధ్రువపత్రం, కులధ్రువీకరణపత్రం, టీసీ, ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులు అందుకు సంబంధించిన సర్టిఫికెట్లు తీసుకురావాల్సి ఉంటుంది.
● ఓసీ అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ 2026–27 మీసేవలో తీసుకున్నది మాత్రమే ఈడబ్ల్యూఎస్ కేటగిరి వర్తిస్తుంది.
● ప్రత్యేక కేటగిరీ విద్యార్థులు(ఎన్‌సీసీ, ఆంగ్లో ఇండియన్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, సీఏపీ, పిడబ్ల్యూడీ, స్కౌట్స్ అండ్ గైడ్స్) విజయవాడలో బెంజిసర్కిల్ సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు ఈ నెల 29, 30 తేదీల్లో హాజరుకావాల్సి ఉంటుంది.
29 నుంచి ఆప్షన్ల ఎంపిక
ఈ నెల 29 నుంచి జూలై 3 వరకు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు. జూలై 4న ఆప్షన్లు మార్చుకునే అవకాశం ఇస్తారు. జూలై 6న కళాశాలల్లో సీట్ల కేటాయింపు ఉంటుందని జిల్లా కన్వీనర్ మురళి వెల్లడించారు. మరిన్ని వివరాలకు హెచ్‌టిటిపిఎస్://ఏపీపీవోఎల్‌వైసీఈటీ.ఎన్‌ఐసి.ఇన్ ను సందర్శించవచ్చన్నారు.
ర్యాంకులు వారీగా షెడ్యూల్ ఇదీ...
తేదీ ర్యాంకులు
ఉదయం 9 నుంచి మధ్యాహ్నాం 1 గంట నుంచి
జూన్ 25 1–10,000 10,001–20,000
26 21,001–31,000 31,001–42,000
27 42,001–54,000 54,001–65,000
28 65,001–77,000 77,001–88,000
29 88,001–99,000 99,001–1,10,000
30 1,10,001 నుంచి 1,20,000 1,20,001–1,30,000
జూలై 1 1,30,001 నుంచి 1,40,000 1,40,001 నుంచి చివరి వరకు
విజయవాడలో ప్రత్యేక కేటగిరి సర్టిఫికెట్లు పరిశీలన ఇలా ..
తేదీ కేటగిరీ ర్యాంకులవారీగా
జూన్ 29 ఎన్‌సీసీ, సీఏపీ 1–60,000
ఆంగ్లో ఇండియన్, పీడబ్ల్యూడీ 1నుంచి చివరిర్యాంకు వరకు
జూన్ 30 సీఏపీ, ఎన్‌సీసీ 60,001 నుంచి చివరిర్యాంకువరకు
స్పోర్ట్స్ అండ్ గేమ్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్ 1నుంచి చివరిర్యాంకువరకు


