21ఆర్‌జేసీ361–270096 కలెక్టర్ కీర్తి
కలెక్టర్ కీర్తి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం కేంద్రంలో ఆదివారం నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ కీర్తి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష నిర్వహణకు అన్ని కేంద్రాల్లో పటిష్ఠ ఏర్పాట్లు చేసి, బయోమెట్రిక్ నమోదు, సీసీ కెమెరాలు, జామర్లు, భద్రతా చర్యలను సమర్ధంగా అమలు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 9 పరీక్షా కేంద్రాల్లో 3,363 మంది అభ్యర్థులకు పరీక్ష నిర్వహించగా, 3,066 మంది హాజరయ్యారని, 297 మంది గైర్హాజరయ్యారని ఆమె తెలిపారు. మొత్తం హాజరు శాతం 91.17 శాతంగా నమోదైనట్లు వెల్లడించారు. పరీక్ష నిర్వహణలో సహకరించిన అన్ని శాఖల అధికారులను కలెక్టర్ అభినందించారు.
కేంద్రాల వారీగా హాజరు ఇలా..
ఎస్‌కేవీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 576 మందికి 526 మంది హాజరైయ్యారన్నారు. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల (అటానమస్)లో 507 మందికి 457, నన్నయ వర్సిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో 504 మందికి 460, కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో 240 మందికి గాను 225, కేంద్రీయ విద్యాలయ, ఓఎన్‌జీసీ బేస్ కాంప్లెక్స్‌లో 360 మందికి 328, ఎస్‌కేవీటీ ఈఎం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 360 మందికి 329, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 288 మందికి 261, దానవాయిపేట మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్‌లో 264 మందికి 244, నెహ్రూనగర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్‌లో 264 మందికి 236 మంది హాజరైనట్టు తెలిపారు.


