ప్రశాంతంగా ‘నీట్‌’ | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ‘నీట్‌’

Jun 22 2026 12:30 AM | Updated on Jun 22 2026 12:30 AM

90.02 శాతం హాజరు

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): వైద్య విద్యా కోర్సులలో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్‌ పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. జిల్లాలోని 11 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 3,232 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 2,922 హాజరయ్యారు. ప్రశ్నపత్రం లీకవడంతో గత మే నెలలో నిర్వహించిన ఈ పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.15 గంటల వరకూ ఈ పరీక్షమరోసారి నిర్వహించారు. స్థానిక గాంధీనగర్‌ మున్సిపల్‌ స్కూల్‌, జేఎన్‌టీయూకేలోని పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో నీట్‌ పరీక్ష ప్రశాంత వాతావరణంలో జరిగిందని అన్నారు. మొత్తం 90.02 శాతం విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు.

లోవకు పోటెత్తిన భక్తులు

తుని రూరల్‌: లోవ దేవస్థానానికి ఆదివారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో వచ్చిన 32 వేల మంది భక్తులు తలుపులమ్మ అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.2,61,690, పూజా టికెట్లకు రూ.4,65,646, కేశఖండన శాలకు రూ.20,880, వాహన పూజలకు రూ.7,416, కాటేజీలు. పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.98,430, విరాళాలు రూ.10,602 కలిపి మొత్తం రూ.8,89,014 ఆదాయం లభించిందని కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు.

స్వగ్రామంలో ‘పెద్ది’ దర్శకుడి సందడి

కొత్తపల్లి: ఉప్పెన, పెద్ది చిత్రాల దర్శకుడు సానా బుచ్చిబాబు ఆదివారం స్వగ్రామం కొత్తపల్లి వచ్చారు. తన నివాసంలో కుటుంబ సభ్యులు, బంధువులతో కలసి కేక్‌ కట్‌ చేసి, పెద్ది సినిమా విజయానందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి పలు విషయాలపై ఆయన ముచ్చటించారు. పెద్ది సినిమా తన జీవితంలో మరపురాని విజయాన్ని అందించిందని ఆనందం వ్యక్తం చేశారు. మరిన్ని మంచి చిత్రాలకు దర్శకత్వం వహించడానికి ప్రేరణ కలిగించిందన్నారు. త్వరలో మరో మంచి చిత్రానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement