పరీక్షకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

పరీక్షకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం

Jun 22 2026 12:30 AM | Updated on Jun 22 2026 12:30 AM

వ్యక్తి మృతి, యువతికి తీవ్ర గాయాలు

కాజులూరు: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికులు, గొల్లపాలెం పోలీసుల కథనం ప్రకారం.. పాతర్లగడ్డకు చెందిన పెండుం సుధీర్‌కుమార్‌ (30) తన సమీప బంధువైన మాదుర శ్రీవల్లిని తన బైక్‌పై రాజమహేంద్రవరంలో నీట్‌ రాసేందుకు తీసుకువెళ్లాడు. తిరిగి తీసుకువస్తుండగా, గొల్లపాలెం తిరుమల ఫంక్షన్‌ హాల్‌ వద్ద మలుపులో కాకినాడ వైపు నుంచి ఎదురుగా వస్తున్న వ్యాన్‌ను ఢీకొట్టాడు. ఈ సంఘటనలో సుధీర్‌కుమార్‌ తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందగా వెనుక కూర్చున్న మాదుర శ్రీవల్లికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. క్షతగాత్రురాలు శ్రీవల్లిని గొల్లపాలెంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ కేసును గొల్లపాలెం ఎస్సై ఎం.మోహన్‌కుమార్‌ దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement