పిచ్చుక ఆకట్టుకుంది! | - | Sakshi
Sakshi News home page

పిచ్చుక ఆకట్టుకుంది!

Jun 22 2026 12:30 AM | Updated on Jun 22 2026 12:30 AM

నాలుగు గోడలు లేక పోయినా కోట కంటే గొప్పదది.. గడ్డి పోచల అమరికలతో అందమైన గూడు అది. చలిగాలులను తట్టుకునే ఆనంద నిలయమది.. పిచ్చుకలు తమ ఇంజినీరింగ్‌ ప్లాన్‌తో నిర్మించుకున్న కట్టడమది. ఈ చిత్రం కిర్లంపూడి నుంచి ప్రత్తిపాడు వెళ్లే ప్రధాన రహదారి పక్క పొలం వద్ద ఆకట్టుకుంది. ఇక్కడి హై టెన్షన్‌ స్తంభం వద్ద అమర్చిన రక్షణ తీగలపై ఇలా వరుసగా పిచ్చుకలు గూళ్లు నిర్మించుకున్నాయి. అడపాదడపా వర్షాలు కురుస్తుండడంతో ఈ గూళ్లను నిర్మించుకుని, తమ పిల్లలను సాకుతున్నాయి.

కిర్లంపూడి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement