రాజమహేంద్రవరం రూరల్: తన తండ్రి కోరిక మేరకు పోలీసు అధికారి అయ్యానని జిల్లా ఎస్పీ (లా అండ్ ఆర్డర్), ప్రస్తుతం విజయవాడ సీఐడీ ఎస్పీగా బదిలీ అయిన అల్లూరి వెంకట సుబ్బరాజు అన్నారు. విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం రాచగుమడాం తన స్వగ్రామమన్నారు. కాంగ్రెస్ నాయకుడైన తన తండ్రి చిన్న నరసింహరాజు రాచగుమడాం గ్రామానికి 25 ఏళ్ల పాటు ఏకగ్రీవ సర్పంచ్‌గా, రెండేళ్లు చీపురుపల్లి సమితి ప్రెసిడెంట్‌గా సేవలందించారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా విద్యార్థి దశలో తన తండ్రితో పాటు అధికారులను కలిసేందుకు వెళ్లేవాడనని, ప్రజల్లో పోలీసులకు ఉన్న గౌరవాన్ని గమనించిన తన తండ్రి.. తనను పోలీసు అధికారి కావాలని కోరారన్నారు. అలా 1989లో ఎస్సైగా ఎంపికయ్యానని, అనంతరం సివిల్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా, 2001లో సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా, 2010లో డీఎస్పీగా, 2020లో అదనపు ఎస్పీగా, నాన్ కేడర్ ఎస్పీగా పదోన్నతి పొందడం జరిగిందని సుబ్బరాజు తెలిపారు.
అల్లూరి వెంకట సుబ్బరాజు, ఎస్పీ


