పిప్పితో ఉపయోగాలు | - | Sakshi
Sakshi News home page

పిప్పితో ఉపయోగాలు

Jun 20 2026 12:25 AM | Updated on Jun 20 2026 12:25 AM

● రసం తీసిన తరువాత వచ్చే పిప్పిని ఎండబెట్టి పశువులకు, కోళ్లకు దాణాగా వాడవచ్చు.

● వర్మీ కంపోస్టుగాను ఉపయోగపడుతుంది.

● గోవా రాష్ట్రంలో ఈ పిప్పిని లిక్కర్‌ తయారీకి వాడతారు.

● ఈ పిప్పి నుంచి ‘పెక్టిన్‌’ అనే ఉత్పత్తిని తయారు చేయవచ్చు. ఇది జామ్‌, చాస్‌, జెల్లీ, కెచప్‌ తయారీలలో చిక్కదనం రావడానికి తోడ్పడుతుంది. పలు రకాల మందుల తయారీలోను, పౌడర్లు, పేస్టుల తయారీలోను వాడతారు.

ఔషధకారిగా..

● జీడిమామిడి పండులో లభ్యమయ్యే సి–విటమిన్‌ నిమ్మ జాతుల కంటే సుమారు 5 రెట్లు అధికంగా ఉంటుంది. పసుపు, ఎరుపు, గులాబి రంగులలో దొరికే ఈ పండ్లలో 85 శాతం రసం, 10 శాతం చక్కెర ఉంటాయి. రసంలో ఫ్రక్టోజు, గ్లూకోజు, సుక్రోజు, మాల్టోజు, మాలిక్‌ ఆమ్లం ఉంటాయి.

● జిగట, నీళ్ల విరోచనాల నివారణకు, స్కర్వీ వ్యాధిని అరికట్టడానికి పండు ఉపయోగపడుతుంది.

● మూత్ర పిండాల సమస్యలు, కలరా, డ్రాప్సీ వ్యాధి నివారణకు ఉపకరిస్తుంది. జీడిమామిడి పండు తిని అరికాళ్ల పగుళ్లను నివారించవచ్చు.

● వీటి విత్తనాలతో తయారు చేసిన పొడి

పాము కాటుకు విరుగుడుగా ఉపయోగిస్తారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement