ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాల విడుదల | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాల విడుదల

Jun 19 2026 12:24 AM | Updated on Jun 19 2026 12:24 AM

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఇంటర్మీడియెట్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. జిల్లావ్యాప్తంగా ఈ పరీక్షల్లో ఫస్టియర్‌ 28.7, సెకండియర్‌ 46.9 శాతం చొప్పున విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్‌ పరీక్షలకు ఎయిడెడ్‌ కళాశాలల నుంచి 31 మంది హాజరవగా ఒక్కరు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ సంస్థల నుంచి 60 మంది పరీక్షలు రాయగా 23 మంది, ప్రభుత్వ కళాశాలల నుంచి 673 మందికి 203 మంది, హైస్కూల్‌ ప్లస్‌ విభాగంలో 179 మందికి 33, ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ కళాశాలల్లో 1,967 మందికి 575 మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో ఎయిడెడ్‌ కళాశాలల నుంచి 33 మందికి ఏడుగురు ఉత్తీర్ణులయ్యారు. ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ నుంచి 32 మందికి 16 మంది, ప్రభుత్వ కళాశాలల నుంచి 552కు 269, హైస్కూల్‌ ప్లస్‌ విభాగంలో 122కు 48, ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ కళాశాలల్లో 2,046 మందికి 967 మంది చొప్పున విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

ద్వారకా తిరుమల..

అ‘ద్వితీయం’

ద్వారకా తిరుమల: రాష్ట్రంలోని ఏడు ప్రధాన దేవాలయాలకు వచ్చే భక్తులకు ఆయా దేవస్థానాలు అందిస్తున్న సేవలపై ప్రభుత్వం తాజాగా నిర్వహించిన సర్వేలో ద్వారకా తిరుమల దేవస్థానానికి రెండో ర్యాంకు దక్కింది. ప్రతి నెలా వాట్సాప్‌, ఐవీఆర్‌ఎస్‌ ద్వారా దర్శనం, తాగునీటి వసతులు, ప్రసాదం రుచి, పారిశుధ్యం అంశాలపై ప్రభుత్వం సర్వే చేస్తోంది. ఇందులో గత నెల అన్ని అంశాల్లోనూ మొదటి ర్యాంక్‌ సాధించిన ద్వారకా తిరుమల దేవస్థానం, జూన్‌ నెలకు సంబంధించి ఈ నెల 16న వెలువడిన సర్వేలో ఓ మెట్టు దిగి, ద్వితీయ స్థానంలో నిలిచింది. దర్శనం, సౌకర్యాల కల్పన, ఇతర అంశాల్లో శ్రీకాళహస్తి 1, ద్వారకా తిరుమల 2, 3, సింహాచలం 4, 5, విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం 6, శ్రీశైలం 7 (చివరి) స్థానాలు సాధించాయి.

వెంకన్న హుండీ ఆదాయం రూ.2.44 కోట్లు

ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి హుండీల ద్వారా 34 రోజులకు రూ.2.44 కోట్ల ఆదాయం లభించిందని ఆలయ ఈఓ, దేవదాయ శాఖ ఉప కమిషనర్‌ నల్లం సూర్యచక్రధరావు తెలిపారు. దేవదాయ శాఖ పర్యవేక్షణాధికారులు సహాయ కమిషనర్‌, మందేశ్వర స్వామి ఆలయ ఈఓ దారపు రెడ్డి సురేష్‌బాబు, దేవదాయ శాఖ రాజమహేంద్రవరం తనిఖీదారు ఎస్‌టీపీటీ శ్రీనివాస్‌, గ్రూపు దేవాలయాల ఈఓలు, ఆత్రేయపురం బి.నరేంద్ర, వెలిచేరు ఎం.సత్యనారాయణల సమక్షంలో హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించామని పేర్కొన్నారు. ప్రధాన హుండీలు, విశ్వేశ్వరస్వామి ఆలయ హుండీలతో కలిపి రూ.1.77 కోట్లు, అన్నప్రసాద హుండీల ద్వారా రూ.66.55 లక్షల ఆదాయం లభించిందని వివరించారు. అలాగే, 52 గ్రాముల బంగారం, 1.588 కిలోల వెండి, 18 దేశాలకు చెందిన 77 విదేశీ కరెన్సీ నోట్లు లభించాయని ఈఓ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement