రోడ్డు ప్రమాదంలో ప్రముఖ కవి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ప్రముఖ కవి మృతి

Jun 19 2026 12:24 AM | Updated on Jun 19 2026 12:24 AM

పి.గన్నవరం : రాజవరం – పొదలాడ రోడ్డులో బెల్లంపూడి గ్రామం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రావులపాలెం ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్న ప్రముఖ కవి కొప్పాడి శ్రీనివాస్‌ (47) మృతి చెందారు. పి.గన్నవరం మండలం పోతవరం గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ ముమ్మిడివరం ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఆయన పలు కవిత్వాలు రాశారు. కొన్ని తెలుగు ఆల్బమ్స్‌కు పాటలు కూడా రాశారు. గురువారం రాజమహేంద్రవరం నుంచి నుంచి పోతవరం గ్రామంలోని స్వగృహానికి మోటార్‌ సైకిల్‌పై వస్తుండగా, బెల్లంపూడి వద్ద అదుపుతప్పి కొబ్బరి చెట్టును ఢీకొని పడిపోయారు. దీంతో అతనికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఆయనకు భార్య ఉషారాణి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అందరితో మంచిగా ఉండే కవి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పి.గన్నవరం ఎస్సై బి.శివకృష్ణ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement