సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం‘ కార్యక్రమంలో భాగంగా బుధవారం రాజమహేంద్రవరంలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రం వేదికగా రుణాలు పంపిణీ చేశారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ కీర్తి డీఆర్‌డీఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏ నగేష్, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. డీఆర్‌డీఏ ద్వారా బ్యాంకు అనుసంధానంతో 270 మంది లబ్ధిదారులకు రూ.3.95 కోట్ల రుణాలు మంజూరు చేశారు. స్వయం సహాయక సంఘాల పురోగతికి బ్యాంక్ లింకేజీ, సీ్త్ర నిధి పథకాల కింద 2,534 సంఘాలకు చెందిన 16,386 మందికి రూ.252.14 కోట్లు రుణాలుగా మంజూరు చేసినట్లు అధికారులు వెల్లడించారు.


