గ్యాస్‌ లీకై గాయాలు | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ లీకై గాయాలు

Jun 15 2026 12:17 AM | Updated on Jun 15 2026 12:17 AM

మామిడికుదురు: గ్యాస్‌ సిలిండర్‌ లీకై ఓ యువతికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. ఈదరాడలోని కమ్మవారిలంకకు చెందిన చుట్టుగుళ్ల చంద్రప్రియ (23) అమలాపురంలోని ఓ ప్రైవేట్‌ డెంటల్‌ ఆస్పత్రిలో నర్స్‌గా పని చేస్తుంది. ఆదివారం సెలవు కావడంతో ఇంటికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇంట్లోని వంట గదికి ఆమ్లెట్‌ వేసేందుకు వెళ్లింది. లైటు వేయగా, గ్యాస్‌ సిలిండర్‌ లీకై మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో చంద్రప్రియ తీవ్రంగా గాయపడింది. ఆమెను 108 అంబులెన్స్‌లో రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థి తి విషమించడంతో అమలాపురం ఆస్పత్రికి తీసుకెళ్లారు. గ్యాస్‌ లీకేజీ కారణంగా ఇలా జరిగిందని తండ్రి వెంకటేశ్వరరావు తెలిపారు. ఆమె తల్లి సాయి జ్యోతి ఉపాధి నిమిత్తం గల్ఫ్‌లో ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement