విద్యుత్‌ షాక్‌తో యువకుడి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో యువకుడి దుర్మరణం

Jun 15 2026 12:17 AM | Updated on Jun 15 2026 12:17 AM

కె.గంగవరం: రొయ్యల చెరువు వద్ద విద్యుత్‌ షాక్‌కు ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. కె.గంగవరం గ్రామానికి చెందిన నేమాని అబ్బుకు దంగేరు శివారు చిట్టూరివారిపాలెం వద్ద రొయ్యల చెరువులు ఉన్నాయి. అక్కడ పని చేసేందుకు ఒడిశాలోని కోరాపూల్‌లోని కొంగ గ్రామానికి చెందిన త్రినాథ్‌గౌడ్‌ (20) నెల రోజుల కిందట చేరాడు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో విద్యుత్‌ షాక్‌ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కె.గంగవరం ఎస్సై సోమేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement