తుని రూరల్: లోవ దేవస్థానంలో తలుపులమ్మ అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చిన 35 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసినట్టు కార్యనిర్వహణ అధికారి పి.విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.292095, పూజా టికెట్లకు రూ.6,33,440, తలనీలాలకు రూ.22,400, వాహన పూజలకు రూ.7,030, పొంగలి షెడ్లు, కాటేజీలు, వసతి గదుల అద్దెలు రూ.91,965, విరాళాలు రూ.24,585, వెరసి మొత్తం రూ.10,71,515 ఆదాయం సమకూరిందని వివరించారు.


