అర్హులందరికీ ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ ఇవ్వాలి

Jun 15 2026 12:17 AM | Updated on Jun 15 2026 12:17 AM

వ్యవసాయ యంత్ర పరికరాలు రైతులకు ఎంతో ఉపయోగకరం. వీటిని అర్హులకు అందించాలి. కేవలం అధికార పార్టీ నాయకులు చెప్పేవారికే ఇవ్వకూడదు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ సైతం అందలేదు. కౌలు రైతులకు సీసీఆర్‌సీ కార్డులు ఇచ్చి, వారికి రాయితీపై యంత్ర పరికరాలు ఇవ్వాలి.

వెలుగుబంటి అచ్యుతరామ్‌, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర రైతు విభాగ సంయుక్త కార్యదర్శి, వేమగిరి

యంత్ర సాయం అందజేయాలి

రైతులు ఎంతో ఆశతో రాయితీ పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే కూటమి పాలనలో అర్హులకు యంత్ర పరికరాలు అందుతాయనే నమ్మకం కలగడం లేదు. వైఎస్సార్‌ సీపీ అధికారంలో ఉన్నప్పుడు అర్హతే ప్రమాణికంగా పథకాలు అమలు చేశారు. కూటమి ప్రభుత్వం కూడా దానిని పాటించాలి.

తోరం శోభన్‌బాబు, రైతు, సీతానగరం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement