గూడు చెదిరి.. గుండె పగిలి.. | - | Sakshi
Sakshi News home page

గూడు చెదిరి.. గుండె పగిలి..

Jun 14 2026 7:22 AM | Updated on Jun 14 2026 7:22 AM

ఇంటి వద్ద చికిత్స పొందుతున్న పక్షవాతం రోగిని పక్కన కూర్చోబెట్టిన సిబ్బంది

పోలీసు బలగాల భద్రత నడుమ ఇళ్లను కూల్చివేస్తున్న నగరపాలక సంస్థ సిబ్బంది

ప్రత్యామ్నాయం చూపించాలి

గత 40 ఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్న పుంత ప్రజలకు ప్రత్యామ్నాయం చూపించకుండా ఖాళీ చేయమనడం దారుణం. గత ప్రభుత్వ హయాంలో ఎంపీ భరత్‌ తమకు రోడ్లు వేసి ఇక్కడే స్థిర నివాసం ఉండేలా చేయాలని చూశారు. ఈలోగా ప్రభుత్వం మారడంతో అంతా తారుమారైంది. రెండేళ్లుగా ఇక్కడ నివసిస్తున్న వారిని అధికారులు, ప్రజా ప్రతినిధులు ఖాళీ చేయమని భయపెడుతున్నారు. ప్రత్యామ్నాయం చూపిస్తే వెళ్లడానికి వీరందరూ సిద్ధంగానే ఉన్నారు. అంతా కూలి పనులు చేసుకుని జీవనం సాగించేవాళ్లే. అర్ధంతరంగా వీరిని పంపించేస్తే ఎక్కడికి వెళ్తారు?

– తిరగటి దుర్గారావు, స్థానికుడు

పక్షవాతం రోగి అని కూడా చూడలేదు

మా మామయ్యకి పక్షవాతం వచ్చి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. వారం రోజుల క్రితం ఇంటికి తీసుకువచ్చాం. ఇంటి వద్దే చికిత్స చేయిస్తున్నాం. శనివారం వచ్చి పక్షవాతంతో బాధపడుతున్న మా మామయ్యని బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నా ఇంటిని కూల్చేశారు. బయట మాతో మాట్లాడుతూనే వెనుక నుంచి ఇంటిని కూల్చేయడం దారుణం.

– కె.లక్ష్మి, బాధితురాలు

ఓట్లడిగిన నాయకులేరీ?

ఇళ్లలోకి దూరి ఓట్లు అడిగిన నాయకులు ఏమయ్యారు? ఇంటింటికీ వచ్చి ఓట్లు అడిగి గెలిచిన ఎమ్మెల్యే ఏమయ్యారు? ఇంటికి వచ్చి ఓట్లు అడిగినప్పుడు మా ఇళ్లు పడగకొడతారని తెలియదా? ఓట్లు వేయించికుని నెగ్గి ఇప్పుడు కట్టుబట్టలతో నడివీధిలోకి నెట్టేస్తుంటే కనీసం మమ్మల్ని అదుకోవడానికి రాలేదు.

– కొల్లు గ్రేస్‌, బాధితురాలు

కట్టుబట్టలతో రోడ్డున పడ్డాం

మాకు వేరే చోట స్థలాన్ని ఇవ్వకుండా సామాన్లు కూడా తీసుకోకుండా ఇంటిని కూల్చివేశారు. కూలి చేసుకుని జీవించే వాళ్లం. ఇప్పటికిప్పుడు పొమ్మంటే ఎక్కడికి పోవాలి? అద్దె కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం.

– దొమ్మేటి లోవ తల్లి

ఇది దారుణం

మా వాళ్లవి నాలుగు ఇళ్లు కూల్చేశారు. అందరం రోడ్డున పడ్డాం. అండగా ఉండవలసిన ఎమ్మెల్యే కనీసం ఇంత దారుణం జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నారు. ఇప్పుడు అద్దె ఇల్లు దొరకడం కూడా కష్టంగా ఉంది. చిన్న పిల్లలు, ముసలి వాళ్లు అని చూడకుండా బలవంతంగా ఖాళీ చేయించారు. వారం ముందు నోటీసులు అందించారు. అంత తొందరగా అద్దె ఇళ్లు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి.

– కొమ్ము సత్యవతి, బాధితురాలు

ఇళ్లు కోల్పోయి.. కన్నీరు మున్నీరై...

50 ఏళ్లుగా ఉంటున్న ఇళ్లు కూల్చివేత

ప్రత్యామ్నాయం చూపకుండా

కూల్చేశారని బాధితులు ఆవేదన

టీడీపీ నాయకులు ఇళ్లు,

స్థలాలు మాత్రం భద్రం

దిక్కుతోచని స్థితిలో ఉన్నాం..

ఆదుకోండని అర్తనాదాలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement