వెంకటేశ్వర మార్కెట్‌లో అగ్ని ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

వెంకటేశ్వర మార్కెట్‌లో అగ్ని ప్రమాదం

Jun 11 2026 12:25 AM | Updated on Jun 11 2026 12:25 AM

అన్నవరం: రత్నగిరిపై బుధవారం భక్తుల రద్దీ నెలకొంది. వేసవి సెలవులు త్వరలో ముగియనుండడంతో సత్యదేవుని దర్శనానికి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వచ్చారు. వీరికి సాధారణ భక్తులు కూడా తోడయ్యారు. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారి సన్నిధికి రావడంతో క్యూలు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం కిటకిటలాడాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. రెండు వేల వ్రతాలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు ఐదు వేల మంది సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు.

రూ.5 లక్షల ఆస్తి నష్టం

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక వెంకటేశ్వర మార్కెట్‌లోని ఓరియంట్‌ ఫ్యాన్ల సర్వీస్‌ దుకాణంలో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే విషయాన్ని 101కు ఫోన్‌ చేయడంతో ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. డి.శ్యామ్‌సుందర్‌ అనే వ్యక్తి వెంకటేశ్వర మార్కెట్‌లోని ఒక భవనంలోని మొదటి అంతస్తులో ఓరియంట్‌ ప్యాన్ల సర్వీసింగ్‌ నిర్వహిస్తున్నాడు. దుకాణంలో షార్ట్‌ షర్యూట్‌ జరిగి మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో రూ.5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. రూ.10 లక్షల విలువైన సామగ్రిని మంటలకు ఆహుతికాకుండా ఫైర్‌ సిబ్బంది నివారించారు.

డెల్టాలకు 8,300

క్యూసెక్కుల విడుదల

ధవళేశ్వరం: గోదావరి డెల్టా కాలువలకు బుధవారం 8,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 3,100, మధ్య డెల్టాకు 700, పశ్చిమ డెల్టాకు 4,500 క్యూసెక్కుల నీటిని వదిలారు. కాటన్‌ బ్యారేజీ వద్ద 9.15 అడుగులకు నీటి మట్టం చేరింది.

విద్యార్థుల వివరాల

సవరణలకు అవకాశం

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల అభ్యర్థుల వివరాల్లో అవసరమైన సవరణలను చేయడానికి ఈ నెల 15వ తేదీ వరకు అవకాశాన్ని పొడిగించినట్లు డీఈఓ కె.వాసుదేవరావు బుధవారం తెలిపారు. హెచ్‌ఎంలు, విద్యార్థుల వివరాలను జాగ్రత్తగా సరిచూసుకుని, సవరణలు ఉంటే నిర్దేశిత సమయంలో హెచ్‌ఎం లాగిన్‌ ద్వారా సమర్పించాలన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

రత్నగిరిపై భక్తుల రద్దీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement