గంగవరం: కొండలు, అటవీ ప్రాంతాల్లో సహజ సిద్ధంగా ఏర్పడిన చెలమల (స్ప్రింగ్ షెడ్ల)ను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా సౌత్ ఇండియాలో పలు ప్రాంతాలకు మహారాష్ట్ర, పుణే బేస్‌లో ఆక్వాడాం ఎన్‌జీలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు కునాల్ సారథ్ ఉపాసనీ సారథ్యంలో శాస్త్రవేత్తలు కుమారి రాజేశ్వరి, సుహాస్ బోస్లే బృందం గంగవరం మండలంలో సోమవారం పర్యటించింది. ఇక్కడి కొండ చెలమలను వారికి ఉపాధి పథకం ఏపీఓ ప్రకాష్ చూపించారు.
ఎండపల్లి పంచాయతీ చిన్న అడ్డపల్లి గ్రామంలో బట్టకొండ వాదనలోద్ది ప్రాంతంలోని చెలమలను ఆ బృంద సభ్యులు పరిశీలించారు. అవి ఎక్కడ పుట్టాయి, ఎక్కడకు చేరుకుంటాయనేది అధ్యాయనం చేశారు. అనంతరం వెదుళ్లకొండ వాగు ప్రాంతంలో మరో చెలమను వారు పరిశీలించారు. వీటిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని ఆయన అన్నారు. వీరి వెంట ఉపాధి హామీ అదనపు ప్రోగ్రాం అధికారి ఎంకేఎస్ ప్రకాష్, జూనియర్ ఇంజినీర్ టి.పద్మనాభం, టీఏలు సీహెచ్ రాధాకృష్ణ , కోసూరి సీతాదేవి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.


