అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరిపై నల్లి తెగులు, తెల్లదోమ పోటు
చర్యలకు ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ డిమాండ్
అల్లవరం: ఉభయ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని వేలాది ఎకరాల్లో కొబ్బరిని నల్లి తెగులు, తెల్లదోమ పోటు తీవ్రంగా నష్టపరుస్తోందని శాసనమండలిలో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ప్రస్తావించారు. నల్లి తెగులు, తెల్లదోమ విస్తారంగా వ్యాప్తి చెందిందని, దీంతో రైతులకు దిగుబడి తగ్గి ఆర్థికంగా నష్టపోతున్నారని వ్యవసాయ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తెల్లదోమ వల్ల ఆకుపై నల్లటి మచ్చలు ఏర్పడి కిరణజన్య సంయోగ క్రియ అడ్డంకిగా మారి దిగుబడి తగ్గడం, పిందెలు రాలిపోవడం జరుగుతున్నాయన్నారు. దీనిపై ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటోందో తెలపాలని ప్రశ్నించారు. కొబ్బరితో పాటుగా అరటి, కోకో వంటి వాణిజ్య పంటలపై తీవ్ర ప్రభావం ఉందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నల్లి తెగులు, తెల్లదోమ నివారణకు తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
3న దర్శనాలు నిలిపివేత
మామిడికుదురు: చంద్ర గ్రహణం సందర్భంగా మార్చి 3వ తేదీ మంగళవారం అప్పనపల్లి బాల బాలాజీ స్వామి వారి ఆలయంలో దర్శనాలు నిలిపివేస్తామని ఈఓ ఎం.రాంబాబు రెడ్డి బుధవారం తెలిపారు. 3వ తేదీ ఉదయం 9 గంటలకు ఆలయాన్ని మూసివేస్తామన్నారు. 4వ తేదీ బుధవారం ఉదయం సంప్రోక్షణ, నిత్య కై ంకర్యాలు అనంతరం ఉదయం 10 గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తామన్నారు.
అంబాజీపేట కొబ్బరి మార్కెట్


