నాలుగేళ్లుగా ఆడుతున్నా
నేను క్రికెట్ నాలుగేళ్లుగా ఆడుతున్నాను. రాష్ట్ర అండర్ 15 జట్టుకు ఎంపికయ్యాను. ఇండియా అండర్–19 ప్రోబబుల్స్‌కు కూడా ఎంపిక అయ్యాను. జిల్లాలో సీనియర్ జట్టుకు ఆడుతున్నాను. భారత జట్టుకు ఆడాలన్నదే నా కల. భారత జట్టు ప్రపంచ కప్ గెలిచిన తరువాత నా కలను నిజం చేసుకోవాలనే పట్టుదల వచ్చింది. – కె.కృష్ణవేణి, కాకినాడ
భారత్ జట్టుకు ఆడాలనే లక్ష్యంతో సాధన
నేను క్రికెట్ ఆడుతున్నానంటే అందుకు నా తల్లిదండ్రులు అందిస్తున్న ప్రోత్సాహమే కారణం. భారత జట్టు సాధించిన విజయం మాకు చాలా స్ఫూర్తిని ఇచ్చింది. క్రికెట్‌లో రాణించాలనే పట్టుదల వచ్చింది. భవిష్యత్‌లో భారత జట్టుకు ఆడాలనే లక్ష్యంతో సాధన చేస్తాను.
– వై.యక్షిత మణి, రాజమహేంద్రవరం
అన్ని క్రీడల్లోనూ రాణించగలం
క్రికెట్ పురుషులదే కాదు.. మహిళలది కూడా. మేము అన్ని క్రీడల్లోనూ సత్తా చూపించగలం. ఇదే చేసి చూపించారు భారత మహిళా జట్టు క్రికెట్ క్రీడాకారిణులు. మా వంటి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. పదకొండు మంది గొప్పగా ఆడి సాధించిన విజయం అది.
– గోదావరి వైష్ణవి, ద్రాక్షారామం
●
నాలుగేళ్లుగా ఆడుతున్నా
నాలుగేళ్లుగా ఆడుతున్నా


